మోదీ వేదికపైకి రాగానే మార్మోగిన ఆరి ఆరి వీ విల్ రాక్ యూ
జాతీయం
జాతీయం
వడోదర: గుజరాత్‌లోని వడోదరలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది.
ప్రధాని మోదీ వేదికపైకి రాగానే ‘ధురంధర్’ సినిమాలోని ‘Aari Aari’, ‘Queen’ ఆల్బమ్‌లోని ‘We Will Rock You’ పాటలు వినిపించాయి. అనంతరం కార్యక్రమానికి హాజరైన వందలాది మంది యువతకు అభివాదం చేస్తూ మోదీ వేదికపై కలియదిరిగారు.
మోదీ వేదికపైకి వచ్చిన సమయంలో పాటలు వినిపించడం, యువతకు ఆయన అభివాదం చేయడం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోపై పలువురు అభిమానులు, నెటిజన్లు స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. కార్యక్రమంలోని దృశ్యాలు ఉత్సాహభరిత వాతావరణాన్ని తలపించాయని పలువురు పేర్కొన్నారు.