ఇకపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో జాతీయ చలనచిత్ర పురస్కారాల వేడుకలు
జాతీయం
జాతీయం
న్యూఢిల్లీ: జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవ వేదికను ఇకపై ఢిల్లీకి మాత్రమే పరిమితం చేయబోమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి సంవత్సరం దేశంలోని ఒక్కో ప్రాంతంలో జాతీయ చలనచిత్ర పురస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
ఈ ఏడాది నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక ఢిల్లీ నుంచి గుజరాత్‌కు మారనుంది. గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో ఈ నెల 22న కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కేంద్రం తెలిపింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సినీ కళాకారులు, సాంకేతిక నిపుణులు, చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది.
జాతీయ చలనచిత్ర పురస్కారాల వేడుకను దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించడం ద్వారా సినీ రంగానికి చెందిన ప్రతిభావంతులను, కళాకారులను ఒకే వేదికపైకి తీసుకురావడంతో పాటు దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమ ఐక్యతను చాటేలా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కేంద్రం పేర్కొంది.