49వ డివిజన్‌లో అభివృద్ధి పనుల నాణ్యతపై అధికారుల తనిఖీ
తెలంగాణ
/
హన్మకొండ
/
హన్మకొండ
హనుమకొండ: హనుమకొండ పరిధిలోని 49వ డివిజన్‌లో రెవెన్యూ కాలనీ, ప్రకాశరెడ్డిపేట ప్రాంతాల్లో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల అభివృద్ధి పనులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల నేపథ్యంలో నిర్మాణాల నాణ్యత, పనుల పురోగతిని తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు. నిర్మాణంలో ఉపయోగిస్తున్న సామగ్రి, పనుల నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.
ఇప్పటికే ప్రారంభమైన పనుల్లో మిగిలిన వాటిని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.