పెంబర్తిలో ఆర్‌డబ్ల్యూఎస్ వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్
తెలంగాణ
/
హన్మకొండ
/
హన్మకొండ
హనుమకొండ జిల్లా: హసన్‌పర్తి మండలం పెంబర్తి గ్రామ పరిధిలోని దత్తాత్రేయ కాలనీలో నిర్మిస్తున్న ఆర్‌డబ్ల్యూఎస్ వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
వాటర్ ట్యాంక్ నిర్మాణాన్ని నిర్దేశిత ప్రమాణాల ప్రకారం చేపట్టడంతో పాటు పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రజలకు తాగునీటి సౌకర్యం మెరుగుపడేలా పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
స్థానికంగా తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టు పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.