BREAKING
రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా.
Date of Publish : 08 September 2026, 06:50 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మహబూబాబాద్‌లో విషాదం.. భర్త ఫోన్ ఎత్తలేదని వివాహిత ఆత్మహత్య

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Sep, 2026 - 06:50 PM
42 వీక్షణలు

మహబూబాబాద్: భర్త ఫోన్‌ ఎత్తలేదన్న మనస్తాపంతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో విషాదం నింపింది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం బొల్లికొండ గ్రామానికి చెందిన అఖిల (20)కు రెండేళ్ల క్రితం మహబూబాబాద్‌లో గృహ రుణ సంస్థలో నిర్వాహకుడిగా పనిచేస్తున్న బాణోత్ హుస్సేన్‌తో వివాహమైంది. వీరికి ఒక కుమార్తె ఉంది.

ఇటీవల అఖిల పుట్టింటికి వెళ్లింది. పాప ఏడుస్తుండటంతో భర్తకు వీడియో కాల్ చేసి పాపతో మాట్లాడించేందుకు ఈ నెల 2న ప్రయత్నించింది. అయితే హుస్సేన్ ఫోన్‌ ఎత్తకపోవడంతో అఖిల తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

అనంతరం ఆమె మహబూబాబాద్‌లోని అత్తగారింటికి చేరుకుని ఎలుకల మందు తిన్నట్లు సమాచారం. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున అఖిల మృతి చెందింది.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలు, ఇతర కారణాలపై కూడా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.