పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం
తెలంగాణ
/
సంగారెడ్డి
/
అమీన్‌పూర్
పటాన్‌చెరులో అక్రమ గంజాయి విక్రయంపై పోలీసులు దాడి చేశారు. అమీన్‌పూర్‌లో నిర్వహించిన తనిఖీల్లో తెలుగు రాజేష్ (26)ను అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి 1.76 కిలోల ఎండు గంజాయి, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
డీసీపీ శేరిలింగంపల్లి ఆదేశాలతో, ఏసీపీ పర్యవేక్షణలో ఎస్హెచ్‌ఓ బృందం ఈ దాడి నిర్వహించింది. ఈ తనిఖీల్లో సీఐ శ్రవణ్ కుమార్, ఎస్సైలు షేక్ ఫయాజ్, స్వప్న మరియు సిబ్బంది పాల్గొన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.