BREAKING
పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి
Date of Publish : 09 September 2026, 09:05 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చింతలపూడి : నిజం గెలిచింది.. ధర్మం నిలిచింది

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Sep, 2026 - 09:05 PM
16 వీక్షణలు

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

చింతలపూడి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ‘నిజం గెలిచింది’ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. శాసనసభ్యుడు సొంగా రోషన్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కొవ్వొత్తులు వెలిగించి మూడేళ్ల క్రితం చోటుచేసుకున్న ఘటనలను గుర్తు చేసుకున్నారు.

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును అక్రమ కేసులో అరెస్టు చేసి 53 రోజుల పాటు జైలులో నిర్బంధించిన నాటి పరిణామాలను ఈ సందర్భంగా నాయకులు ప్రస్తావించారు. ఆ క్లిష్ట సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు చంద్రబాబుకు అండగా నిలిచారని పేర్కొన్నారు.

న్యాయం, ప్రజాస్వామ్యం, నిజం కోసం తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఐక్యంగా పోరాడాయని తెలిపారు. అనంతరం ‘నిజం గెలిచింది.. న్యాయం గెలిచింది.. ధర్మం గెలిచింది’ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

చీకటి ఎన్ని రోజులు ఉన్నా.. చివరికి గెలిచేది నిజమేనని నాయకులు పేర్కొన్నారు.