బెస్ట్ టీచర్ అవార్డు పొందుకున్న ఉషారాణి
మండల ఉత్తమ ఉపాధ్యాయురాలిగా సాకా ఉషారాణికి అవార్డు
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు చేతుల మీదుగా సత్కారం
దేవరపల్లి | Ntoday News
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రదానోత్సవం నిర్వహించారు. పల్లంట్ల గ్రామంలోని ఎంపీపీ మెయిన్ స్కూల్‌లో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా పనిచేస్తున్న శ్రీమతి సాకా ఉషారాణిని మండల ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు చేతుల మీదుగా సాకా ఉషారాణికి మండల బెస్ట్ టీచర్ అవార్డును అందజేసి ఘనంగా సత్కరించారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి, బోధనా రంగంలో ఆమె అందిస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డును ప్రదానం చేసినట్లు తెలిపారు.
ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శకులుగా నిలుస్తూ సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. ఉత్తమ సేవలకు గుర్తింపుగా అవార్డు అందుకోవడం ఇతర ఉపాధ్యాయులకు కూడా స్ఫూర్తినిస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంఈఓ భరత్ రాజు, సూర్యనారాయణ మూర్తి, దొడ్డిగార్ల సువర్ణ రాజు, కుప్పాల దుర్గారావు, కొయ్య ప్రసన్న కుమార్, ఎం. నాగేశ్వరరావు, పి. ప్రసాద్, ఈశ్వరరావు, పి. సుజాత, ఎం. వెంకట, కే. ఆనంద్ కుమార్, రత్నం, కే. వెంకటేష్, ఏ. రమణతో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.