చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు ఎల్లపుడు కృషి చేద్దాం.
ఎల్కతుర్తి :సెప్టెంబర్ 10 , వీరవనిత చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, రజక సంఘం నాయకులు తంగళ్ళపల్లి రాజ్ కుమార్ అన్నారు. గురువారం బస్టాండ్ సమీపాన అంబేద్కర్ జంక్షన్ వద్ద రజక సంఘం మరియు వివిధ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తంగళ్ళపల్లి రాజ్ కుమార్ అధ్యక్షత వహించగా అన్ని సంఘాల నాయకులు చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు.ఈ సందర్భంగా వివిధ కుల సంఘాల నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలతో పోరాడి అణగారిన వర్గాల్లో స్ఫూర్తిని నింపారని అన్నారు. భూస్వామ్య, పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఐలమ్మ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు తంగళ్ళపల్లి రమేష్, మండల అధ్యక్షులు సబ్బు కొమురయ్య, భువనగిరి స్వామి, అంచనగిరి సల్మాన్, గుడెల్లి శ్రీనివాస్, బోనగిరి సమ్మయ్య, వీరభద్ర బోనగిరి కోటి అశోక్ చీకటి లక్ష్మణ్ గ్రామ ముఖ్య అతిథులు సర్పంచ్, ఉప సర్పంచ్ గోడిశాల రాజు, మాజీ సర్పంచ్ కాంగ్రెస్ నాయకులు గోడిశాల యాదగిరి గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు శీలం అనిల్ కుమార్, సీనియర్ నాయకులు డాక్టర్ రమేష్, శనిగరపు వెంకటేష్, బిఆర్ఎస్ నాయకులు అల్లం కొండ రాజు, గొడిశాల వినయ్ గౌడ్, కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షులు జనగాని లక్ష్మీనారాయణ గౌడ్, ప్రధాన కార్యదర్శి బత్తిని శ్రీనివాస్, కల్లు గీత కార్మిక సంఘం సోషల్ మీడియా కన్వీనర్, సీనియర్ జర్నలిస్ట్ జనగాని ప్రవీణ్ గౌడ్, కందుకూరి మహేష్ చారి, రమేష్ చారి, వెంకటరమణ, వివిధ గ్రామ సంఘ పెద్దలు కమిటీ సభ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.