పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ
పల్నాడు: రొంపిచర్ల మండల పరిధిలోని సంగం డెయిరీ పాల సేకరణ కేంద్రం గొడవర్తి వెంకటేశ్వర్లు (వెండార్ పాయింట్) వద్ద పాడి రైతులకు 2025–26 సంవత్సరానికి సంబంధించిన బోనస్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పల్నాడు జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం లిమిటెడ్ (సంగం డెయిరీ) ఆధ్వర్యంలో రైతుల సంక్షేమానికి కట్టుబడి ఈ బోనస్ అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా పాల కేంద్రం నిర్వాహకులు మాట్లాడుతూ, పాడి రైతుల శ్రమను గుర్తించి సంగం డెయిరీ చైర్మన్ శ్రీ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ నాయకత్వంలో రైతులకు ప్రతి ఏటా లాభాల్లో వాటాను బోనస్ రూపంలో వందకి నాలుగు రూపాయలు చొప్పున అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామంలోని పాల ఉత్పత్తిదారులకు నగదు బోనస్‌తో పాటు సంగం డెయిరీ ఉత్పత్తుల విటమిన్ మిక్చర్ మరియు డి వాల్మీ టాబ్లెట్స్ ను ఉచితంగా పంపిణీ చేశారు. అవి రెండూ పశువులకు వాడటం వల్ల చాలా ఆరోగ్యకరంగా ఉంటాయని తెలిపారు. నాణ్యమైన పాలు పోస్తూ డెయిరీ అభివృద్ధికి సహకరిస్తున్న రైతులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక పాల సంఘం ప్రతినిధులు, నిర్వాహకులు, పాడి రైతులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. బోనస్ అందుకున్న రైతులు హర్షం వ్యక్తం చేస్తూ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.