ఎంబీబీఎస్‌లో ఉచిత సీటు సాధించిన విద్యార్థికి ఘన సన్మానం
తెలంగాణ
/
ఖమ్మం
మధిర: ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం మధిర మండలం దెందుకూరు గ్రామానికి చెందిన చుంచు వేణుగోపాల్ కుమారుడు సాయి గోకుల్ ఎంబీబీఎస్‌లో ఉచిత సీటు సాధించాడు. ఖమ్మంలోని మమతా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదువుకు ఉచిత సీటు లభించిన సందర్భంగా నారాయణ బెస్ట్ ఫౌండేషన్ పాఠశాల యాజమాన్యం, అధ్యాపక బృందం గురువారం సాయి గోకుల్‌ను ఘనంగా సన్మానించింది.
ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం బోనగిరి నారాయణరావు, ప్రధానోపాధ్యాయురాలు వనజతో పాటు అధ్యాపకులు సాయి గోకుల్‌ను అభినందించారు. పట్టుదలతో చదివి వైద్య విద్యలో సీటు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు.