BREAKING
గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు ఎల్లపుడు కృషి చేద్దాం. రామన్నపేటలో చాకలి ఐలమ్మ, సత్తెనపల్లి రామకృష్ణ వర్ధంతి కార్యక్రమం ఉరుమడ్ల చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు ఎల్లపుడు కృషి చేద్దాం. రామన్నపేటలో చాకలి ఐలమ్మ, సత్తెనపల్లి రామకృష్ణ వర్ధంతి కార్యక్రమం ఉరుమడ్ల చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం
Date of Publish : 10 September 2026, 03:52 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Sep, 2026 - 03:52 PM
9 వీక్షణలు

మధిర: తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిరలో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విగ్రహానికి మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పారుపల్లి విజయ్ కుమార్, మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తలుపుల వెంకటేశ్వర్లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూస్వాములు, దొరల పెత్తనానికి వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ ధైర్యంగా పోరాడారని కొనియాడారు. అణగారిన వర్గాల హక్కులు, ఆత్మగౌరవం కోసం ఆమె సాగించిన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిందన్నారు. మహిళలు, పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఐలమ్మ ప్రదర్శించిన తెగువ, ధైర్యం నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు.

చాకలి ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం, అణగారిన వర్గాల హక్కుల కోసం కృషి చేయడమే ఆమెకు అందించే నిజమైన నివాళి అని వారు అన్నారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నకిరికంటి రాజేశ్వరి, బోడిపూడి రేవతి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రంగా హనుమంతరావు, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు తూమాటి నవీన్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు ఐలూరి సత్యనారాయణ రెడ్డి, సామినేని రామనాథం, సాలిక సురేష్, మువ్వా వెంకయ్య బాబు, పతేపరపు సంగయ్య, చక్రి, దోర్నాల సునీల్, దైవజ్ఞాచారి, అద్దంకి మంజీరా, మల్లెల సత్యనారాయణ, గాలి ప్రసాద్, కోటా డేవిడ్, కోరంపల్లి అంకమ్మరావు, ప్రసాద్ రెడ్డి, ఆవుల శ్రీనివాసరావు, అద్దంకి నాగరాజు, రాయల శ్రీనివాసరావు, బోడిపూడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని చాకలి ఐలమ్మకు ఘన నివాళులర్పించారు.