మధిర: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం
తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం మధిరలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో గురువారం పరిశుభ్రత, పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ జి. శంకర్ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా నిర్దేశిత ప్రదేశాల్లో మాత్రమే వేయడం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పరిశుభ్రమైన పరిసరాలు ఆరోగ్యకరమైన జీవనానికి పునాది అని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి పరిశుభ్రతను తన బాధ్యతగా భావించాలని సూచించారు.
అనంతరం విద్యార్థులు కళాశాల ఆవరణను శుభ్రపరిచారు. పరిసర ప్రాంతాల్లో పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కార్యక్రమ నిర్వాహకులు సూచించారు.
ఈ కార్యక్రమంలో జాతీయ సేవా పథకం కార్యక్రమ అధికారి బి. తౌరియా, ఆర్‌సీహెచ్ సాంబయ్య, బి. ఉపేందర్, ఎం. లాలయ్యతో పాటు అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.