BREAKING
హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు ఎల్లపుడు కృషి చేద్దాం. రామన్నపేటలో చాకలి ఐలమ్మ, సత్తెనపల్లి రామకృష్ణ వర్ధంతి కార్యక్రమం హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు ఎల్లపుడు కృషి చేద్దాం. రామన్నపేటలో చాకలి ఐలమ్మ, సత్తెనపల్లి రామకృష్ణ వర్ధంతి కార్యక్రమం
Date of Publish : 10 September 2026, 06:38 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మహిళా సంఘాలకు అదనపు ఆదాయం.. విజయ డెయిరీ పార్లర్లు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Sep, 2026 - 06:38 PM
20 వీక్షణలు

హైదరాబాద్: మహిళా సంఘాలకు అదనపు ఆదాయం కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో నిర్వహిస్తున్న 221 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లలో విజయ డెయిరీ పార్లర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

తొలి దశలో 96 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లలో విజయ డెయిరీ పార్లర్లను ఏర్పాటు చేయనున్నారు. అనంతరం మిగిలిన క్యాంటీన్లకు కూడా ఈ సౌకర్యాన్ని విస్తరించనున్నారు. ఒక్కో పార్లర్ ఏర్పాటుకు సుమారు రూ.2 లక్షల వ్యయం అవుతుందని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ మొత్తాన్ని జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ద్వారా రుణ రూపంలో అందించనున్నారు. మహిళా సంఘాల సభ్యులు పార్లర్లలో విజయ డెయిరీకి చెందిన పాలు, పాల ఉత్పత్తులు, ఇతర ఆహార ఉత్పత్తులను విక్రయించుకోవచ్చు. తద్వారా క్యాంటీన్ నిర్వహణతో పాటు డెయిరీ ఉత్పత్తుల విక్రయాల ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశం కల్పిస్తున్నారు.

మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు స్వయం ఉపాధి అవకాశాలను పెంచేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు