BREAKING
హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు ఎల్లపుడు కృషి చేద్దాం. రామన్నపేటలో చాకలి ఐలమ్మ, సత్తెనపల్లి రామకృష్ణ వర్ధంతి కార్యక్రమం హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు ఎల్లపుడు కృషి చేద్దాం. రామన్నపేటలో చాకలి ఐలమ్మ, సత్తెనపల్లి రామకృష్ణ వర్ధంతి కార్యక్రమం
Date of Publish : 10 September 2026, 07:00 pm
Posted by : SEETHA KIRAN KUMAR

సచివాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ అధికారులు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
10 Sep, 2026 - 07:00 PM
6 వీక్షణలు

సీఎం రిలీఫ్ ఫండ్‌ మంజూరుకు రూ.లక్ష లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణ

హైదరాబాద్ | Ntoday News

తెలంగాణ సచివాలయంలో లంచం తీసుకుంటూ ఇద్దరు ప్రభుత్వ సిబ్బంది ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కు సంబంధించిన నిధుల మంజూరు కోసం లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు ఆరోపించారు.

సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.2 లక్షలు మంజూరు చేసేందుకు రూ.1 లక్ష లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ మేరకు అందిన ఫిర్యాదు ఆధారంగా ఏసీబీ అధికారులు వల పన్ని లంచం తీసుకుంటున్న సమయంలో సంబంధిత అధికారులను పట్టుకున్నట్లు తెలిసింది.

ఈ ఘటనలో సెక్షన్ ఆఫీసర్ వినోద్‌తో పాటు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి రాఘవేంద్రను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించినట్లు సమాచారం.

లంచం వ్యవహారంపై ఏసీబీ అధికారులు తదుపరి విచారణ చేపడుతున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.