BREAKING
రామన్నపేటలో చాకలి ఐలమ్మ, సత్తెనపల్లి రామకృష్ణ వర్ధంతి కార్యక్రమం ఉరుమడ్ల చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి రామన్నపేటలో చాకలి ఐలమ్మ, సత్తెనపల్లి రామకృష్ణ వర్ధంతి కార్యక్రమం ఉరుమడ్ల చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి
Date of Publish : 10 September 2026, 02:27 pm
Posted by : NTODAY NEWS

రామన్నపేటలో చాకలి ఐలమ్మ, సత్తెనపల్లి రామకృష్ణ వర్ధంతి కార్యక్రమం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
10 Sep, 2026 - 02:27 PM
10 వీక్షణలు

రజక వృత్తిదారుల సంఘం రామన్నపేట మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు

రామన్నపేట | Ntoday News

చాకలి ఐలమ్మ, సత్తెనపల్లి రామకృష్ణ వర్ధంతిని పురస్కరించుకుని రజక వృత్తిదారుల సంఘం రామన్నపేట మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇరువురి చిత్రపటాలకు పూలమాలలు వేసి వారి సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో ధైర్యసాహసాలతో పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం చేసిన పోరాటం చిరస్మరణీయమని అన్నారు. ఆమె పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు.

అదేవిధంగా సత్తెనపల్లి రామకృష్ణ వర్ధంతి సందర్భంగా ఆయన అందించిన సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. రజక వృత్తిదారుల అభ్యున్నతికి కృషి చేసిన వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

సమాజంలో రజక వృత్తిదారుల సంక్షేమం, హక్కుల సాధన కోసం సంఘం ఆధ్వర్యంలో నిరంతరం కృషి చేస్తామని నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రజక వృత్తిదారుల సంఘం రామన్నపేట మండల కమిటీ సభ్యులు, నాయకులు, వృత్తిదారులు, యువత తదితరులు పాల్గొన్నారు.