తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి
హైదరాబాద్/ఎన్ టుడే న్యూస్.
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ వర్ధంతి బేగంపేట డివిజన్ ప్రకాష్ నగర్ లేబర్ అడ్డా పై నిర్వహించారు. సనత్ నగర్ జోన్ సీఐటీయూ నాయకులు పి.మల్లేష్ మాట్లాడుతూ
ఆనాడు ఐలమ్మ సంఘం నాయకులతో కలిసి
నాలుగు వందల మంది దేశముఖ్ గూండాలను తరిమికొట్టారన్నారు. 'ఈ భూమీ నాది పండించిన పంట నాది తీసుకెళ్ళడానికి దొరెవ్వడు నా ప్రాణం పోయాకే యీ పంట,భూమీ దక్కించుకోండి' అంటూ ఐలమ్మ మాటలను తూటాలుగా పేల్చిందన్నారు. సంఘం నాయకులు పండించిన ధాన్యాన్ని,మోపులు కట్టి, ఐలమ్మ ఇంటికి చేర్చారు.
ఐలమ్మ భూపోరాటం, తెగింపు, పోరాట పటిమ ఆనాడు మొత్తం తెలంగాణ నైజాం సంస్థానంలో భూ పోరాటాలకు ఊపునిచ్చిందన్నారు. చివరి శ్వాస వరకు ఎత్తిన ఎర్ర జెండా నిడలోనే పయనించిందన్నారు. నేడు ఐలమ్మ స్ఫూర్తితో మన హక్కులను కాపాడుకోవడానికి, మన సమస్యలు పరిష్కరించాలని ఉద్యమిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో పరశురాం, బాలకృష్ణ, శ్రీనివాస్, రాందాస్, బిచ్చు, అంజమ్మ, లక్ష్మీ, విజయ, నరేష్ విజయ్, రాజు రామచంద్ర తదితరులు పాల్గొన్నారు