హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా
హైదరాబాద్/ఎన్ టుడే న్యూస్.
పాతబస్తీ పేద ప్రజల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి విడనాడాలి.ఎండి అబ్బాస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
హైదరాబాదు జిల్లా కలెక్టర్ ఆఫీసు లకిడికపూల్ లో, పాతబస్తీ నుంచి ఇండ్లు లేని నిరుపేదలు ఇండ్ల సమస్య పరిష్కారం కోసం కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది.ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్ సౌత్ జిల్లా కార్యదర్శి ఎండి అబ్బాస్ హాజరై మాట్లాడుతూ..అత్యంత ధనిక రాష్ట్రమైన తెలంగాణలో పాతబస్తీ ప్రజల సమస్యలను పట్టించుకునే నాధుడు లేడని, సిపిఎం పార్టీ హైదరాబాద్ సౌత్ జిల్లా కార్యదర్శి అబ్బాస్ అన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలో ముఖ్యంగా పాతబస్తీలో లక్షలాదిమంది పేద ప్రజలు ఇండ్లు లేక అద్దె కొంపల్లో నివసిస్తూ వేల రూపాయలల్లో పెరుగుతున్న అద్దెలు కట్టలేని పరిస్థితి ఉన్నదని, అందుకోసం అధికారంలో కాంగ్రెస్ ఉన్న టిఆర్ఎస్ ఉన్న హైదరాబాద్ పేదల,ఇండ్ల సమస్య పరిష్కారం చేయడంలో విఫలమయ్యారని అన్నారు. హైదరాబాద్ పాతబస్తీలో ప్రజలు ముఖ్యంగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. చిన్నచిన్న వ్యాపారాలు చేస్తున్నారు .పొద్దంతా కష్టపడ్డ ఏరోజుకారోజు కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. దానికి తోడు ప్రభుత్వ పాఠశాల నిర్లక్ష్యం వలన ప్రైవేట్ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాల్సిన పరిస్థితి అటు పాఠశాల ఫీజులు ఇటు ఇంటి అద్దె, స్కూలు ఫీజులు కట్టలేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కానీ అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా వారి సమస్యలు పట్టట్లేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇండ్లు లేని పేదల పట్ల నిర్లక్ష్యం వీడి అర్హులైన పేదలందరికీ ఇప్పుడు రెడీగా ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇండ్లలో అలాట్మెంట్ ఇవ్వాలని ప్రభుత్వ కాలి స్థలాలను గుర్తించి ఇల్లు కట్టించి ఫ్రీగా ఇవ్వాలని సిపిఎం సౌత్ జిల్లా కమిటీ నాయకులు కోరారు.