BREAKING
రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు ఎల్లపుడు కృషి చేద్దాం. రామన్నపేటలో చాకలి ఐలమ్మ, సత్తెనపల్లి రామకృష్ణ వర్ధంతి కార్యక్రమం ఉరుమడ్ల చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు ఎల్లపుడు కృషి చేద్దాం. రామన్నపేటలో చాకలి ఐలమ్మ, సత్తెనపల్లి రామకృష్ణ వర్ధంతి కార్యక్రమం ఉరుమడ్ల చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
Date of Publish : 10 September 2026, 05:18 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రెండు కాలనీలకు ఉపయోగపడే మార్గంలో సీసీ రహదారి నిర్మించాలని వినతి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Sep, 2026 - 05:18 PM
1 వీక్షణలు

రెండు కాలనీలకు ఉపయోగపడే మార్గంలో సీసీ రహదారి నిర్మించాలని వినతి

చింతలపూడి: పట్టణంలోని సుప్రియన్ పేటలో మంజూరైన సీసీ రహదారిని ప్రజలకు ఉపయోగపడే మార్గంలో నిర్మించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. సుప్రియన్ పేటలో సుమారు 200 మీటర్ల మేర సీసీ రహదారి నిర్మాణానికి మంజూరు కాగా, అందులో 40 మీటర్ల రహదారిని ప్రజలు నివాసం ఉండని ప్రాంతంలో నిర్మించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

సుప్రియన్ పేట, బట్టువారిగూడెం కాలనీలను కలుపుతూ రెండు ప్రాంతాల ప్రజలకు ప్రయోజనం చేకూరే మార్గంలో రహదారి నిర్మించాల్సి ఉండగా, అందుకు భిన్నంగా పట్టుమని నాలుగు ఇళ్లు కూడా లేని ప్రాంతంలో 40 మీటర్ల సీసీ రహదారి నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు వాపోతున్నారు. నిబంధనలకు అనుగుణంగా ప్రజలకు ఉపయోగపడే మార్గంలోనే రహదారి నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.

సుప్రియన్ పేట, బట్టువారిగూడెం ప్రాంతాల ప్రజలు సచివాలయానికి వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గమని స్థానికులు తెలిపారు. రెండు కాలనీలను అనుసంధానించేలా రహదారి నిర్మిస్తే పెద్ద సంఖ్యలో ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, ప్రజలకు ఉపయోగపడే మార్గంలో సీసీ రహదారి నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.