చాట్రాయి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి కొమ్ము ఆనందం
చాట్రాయి: ఉపాధి కూలీలకు 200 రోజులు పని కల్పించి, రోజుకు రూ.500 కూలీ చెల్లించాలి
ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని సీపీఐ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం వ్యవసాయ కార్మిక సంఘం చాట్రాయి మండల కార్యదర్శి కొమ్ము ఆనందం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.
ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ కూలీలకు ఏడాదికి 200 రోజుల పని కల్పించాలని వారు డిమాండ్ చేశారు. పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా ఉపాధి కూలీల రోజువారీ వేతనాన్ని రూ.500కు పెంచి చెల్లించాలని కోరారు.
వర్షాభావ పరిస్థితులతో వ్యవసాయ పనులు తగ్గిపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సంఘం నాయకులు తెలిపారు. కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు కరువు పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.