BREAKING
హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు ఎల్లపుడు కృషి చేద్దాం. రామన్నపేటలో చాకలి ఐలమ్మ, సత్తెనపల్లి రామకృష్ణ వర్ధంతి కార్యక్రమం హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు ఎల్లపుడు కృషి చేద్దాం. రామన్నపేటలో చాకలి ఐలమ్మ, సత్తెనపల్లి రామకృష్ణ వర్ధంతి కార్యక్రమం
Date of Publish : 10 September 2026, 06:28 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రాజ్‌భవన్‌ను ఆశ్రయించిన జోగి మేఘన.. రక్షణ కల్పించాలని గవర్నర్‌కు వినతి

ఆంధ్రప్రదేశ్
/ ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Sep, 2026 - 06:28 PM
29 వీక్షణలు

విజయవాడ: మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై తనకు ఎదురైన వేధింపులు, బెదిరింపులపై ఆయన కోడలు జోగి మేఘన రాష్ట్ర గవర్నర్‌ను ఆశ్రయించారు. తనపై జరిగినట్లు ఆరోపిస్తున్న దాడులు, కట్నం కోసం వేధింపులు, కేసు ఉపసంహరించుకోవాలని బెదిరింపులు వంటి అంశాలను ప్రస్తావిస్తూ రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు అర్జీ సమర్పించినట్లు సమాచారం.

మేఘన ఆరోపణల ప్రకారం, వివాహం అనంతరం అదనపు కట్నం, ఖరీదైన కారు, విలువైన ఆభరణాల కోసం తనను వేధించారని పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో తన ప్రాణాలకు ముప్పు కలిగించేలా వ్యవహరించారని ఆమె ఆరోపించారు.

గోవా సమీపంలో ఈత రాని తనను నీటిలోకి తోసే ప్రయత్నం చేశారని, ఘాట్‌కేసర్ ప్రాంతంలోని ఓ నిర్మానుష్య ప్రదేశంలో దిండుతో ముఖాన్ని అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసే ప్రయత్నం జరిగిందని మేఘన ఆరోపించినట్లు సమాచారం. ఇంటి మేడపై కూడా తనను బెదిరించారని, మూడో అంతస్తులో నిర్బంధించి ఆహారం అందించకుండా ఇబ్బందులకు గురిచేశారని ఆమె పేర్కొన్నారు. తన కదలికలను గమనించేందుకు డ్రోన్లను ఉపయోగించారని కూడా ఆరోపించారు.

మత విశ్వాసాల విషయంలోనూ వేధింపుల ఆరోపణలు

వివాహానికి ముందు కుటుంబ సభ్యుల మతపరమైన నేపథ్యాన్ని తన వద్ద దాచారని మేఘన ఆరోపించారు. వివాహం అనంతరం తన మత విశ్వాసాలను మార్చుకోవాలని ఒత్తిడి తెచ్చారని, పూజలు నిర్వహించుకోవడానికి కూడా అనుమతించలేదని ఆమె పేర్కొన్నారు. ఈ అంశాన్ని ప్రశ్నించినందుకే తనపై మరింత వేధింపులు జరిగాయని ఆరోపించారు.

కేసు ఉపసంహరణకు ఒత్తిడి

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నంబర్ 326/2026 నమోదైందని, భారతీయ న్యాయ సంహితతో పాటు కట్న నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు మేఘన తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. అయితే కేసు ఉపసంహరించుకోవాలని, లేదంటే తన తల్లిదండ్రులను కూడా అంతం చేస్తామని బెదిరింపులు వస్తున్నాయని ఆమె ఆరోపించారు.

ఈ నేపథ్యంలో తనకు, తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించడంతో పాటు కేసులో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిగేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరినట్లు తెలుస్తోంది.

మేఘన చేసిన ఆరోపణలు ప్రస్తుతం విచారణలో ఉన్న అంశాలు కావడంతో, వాటిపై పోలీసుల దర్యాప్తు, న్యాయస్థానంలో జరిగే తదుపరి ప్రక్రియ ద్వారా వాస్తవాలు తేలాల్సి ఉంది. ఆరోపణలు నిజమని నిర్ధారణ అయితే బాధ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.