BREAKING
నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి
Date of Publish : 11 September 2026, 07:01 am
Posted by : JP.NAGIREDDY

నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
JP.Nagireddy రాయచోటి మండల ప్రతినిధి
11 Sep, 2026 - 07:01 AM
13 వీక్షణలు

సెప్టెంబర్‌ 11 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు.. అక్టోబర్‌ 12 వరకు అవకాశం

అమరావతి | Ntoday News

ఆంధ్రప్రదేశ్‌లో 2026–27 విద్యా సంవత్సరానికి నేషనల్‌ మీన్స్‌-కమ్‌-మెరిట్‌ స్కాలర్‌షిప్‌ (NMMS) పరీక్షను నవంబర్‌ 15న నిర్వహించనున్నారు. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది.

ప్రభుత్వ, జెడ్పీ, మునిసిపల్‌, ఎయిడెడ్‌, ఏపీ మోడల్‌, MPUP పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులు. 7వ తరగతిలో OC/BC విద్యార్థులు కనీసం 55 శాతం, SC/ST విద్యార్థులు 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. అలాగే తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3.50 లక్షలకు మించకూడదు.

NMMS పరీక్షకు OC/BC విద్యార్థులకు రూ.100, SC/ST విద్యార్థులకు రూ.50 పరీక్ష రుసుముగా నిర్ణయించారు.

అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్‌ 11 నుంచి అక్టోబర్‌ 12 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. దరఖాస్తులను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. (bse.ap.gov.in)

విద్యార్థులు దరఖాస్తు ప్రక్రియను గడువులోగా పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. NMMSకు సంబంధించిన తాజా నోటిఫికేషన్‌, మార్గదర్శకాలు, పరీక్ష వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించుకోవచ్చు.