BREAKING
ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ
Date of Publish : 10 September 2026, 09:43 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విస్సన్నపేట: జలంధర్‌లో ఏఐకేఎం 5వ జాతీయ మహాసభలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Sep, 2026 - 09:43 PM
5 వీక్షణలు

అఖిల భారత కిసాన్ మహాసభ 5వ జాతీయ మహాసభలు పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌లో సెప్టెంబర్ 20, 21 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఏఐకేఎం జాతీయ కార్యదర్శి డి. హరినాథ్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో నిర్వహించిన సమావేశంలో ఆయన మహాసభల వివరాలను వెల్లడించారు. మహాసభలను విజయవంతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా, జిల్లాల వారీగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు హరినాథ్ తెలిపారు. శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలతో పాటు వినుకొండ, కర్నూలు, రాయలసీమ ప్రాంతాల నుంచి ప్రతినిధులు జలంధర్ మహాసభలకు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయాన్ని, రైతాంగాన్ని పరిరక్షించాలి స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం రైతులు పండించే పంటలకు సాగు ఖర్చులపై అదనంగా 50 శాతం కలిపి మద్దతు ధర కల్పించాలని హరినాథ్ డిమాండ్ చేశారు. రైతులు ఎదుర్కొంటున్న అప్పుల సమస్య నుంచి వారిని రక్షించేందుకు రుణ విమోచన చట్టాన్ని తీసుకురావాలని కోరారు. 60 సంవత్సరాలు నిండిన సన్నకారు, చిన్న, మధ్యతరగతి రైతులకు నెలకు రూ.10 వేల పింఛను ఇవ్వాలని డిమాండ్ చేశారు. భారత్, అమెరికా మధ్య కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని ఆయన కోరారు. కౌలు రైతులందరికీ భూ యజమాని సంతకంతో సంబంధం లేకుండా గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని, హామీ లేకుండా రుణాలు అందించాలని అన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో పంట నష్టపరిహారాన్ని నేరుగా కౌలు రైతులకే అందించే విధానం అమలు చేయాలని కోరారు. కరువు ప్రాంతాలను వెంటనే ప్రకటించాలి ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని హరినాథ్ పేర్కొన్నారు. కరువు ప్రభావిత ప్రాంతాలను తక్షణమే కరువు జిల్లాలుగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ సత్వరం పూర్తి చేయాలని కోరారు. బలవంతపు భూసేకరణ, భూసమీకరణను నిలిపివేయాలని, పోలవరం, శ్రీశైలం, వెలుగొండ ప్రాజెక్టుల నిర్వాసితులందరికీ నష్టపరిహారం అందించాలని హరినాథ్ డిమాండ్ చేశారు. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని అన్నారు. అన్ని రకాల పంటలకు పంటల బీమా వర్తించేలా చర్యలు తీసుకోవాలని, బీమా ప్రీమియాన్ని కూడా ప్రభుత్వమే భరించాలని హరినాథ్ కోరారు. ఈ సమావేశంలో ఏలూరు జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు, ఏఐసీసీ కార్యదర్శి వేముల బక్కయ్య, ఐఫా కార్యదర్శి పీకళావతి, భరోత్ పిక్లా నాయక్, పి.గోవిందు, చాట్ల బాబురావు, భూతం మారయ్య, కలపాల వెంకటేశ్వరరావు, భవాని తదితరులు పాల్గొన్నారు.