BREAKING
ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ
Date of Publish : 10 September 2026, 10:06 pm
Posted by : DAVU RAVINDER REDDY

MBBS, BDS మేనేజ్‌మెంట్ కోటా ప్రవేశాలకు వెబ్ కౌన్సెలింగ్

తెలంగాణ
Reporter
Davu Ravinder Reddy Ghatkesar Mandal Reporter
10 Sep, 2026 - 10:06 PM
8 వీక్షణలు

7,113 మంది అభ్యర్థులతో తుది మెరిట్ జాబితా విడుదల

హైదరాబాద్ | Ntoday News

తెలంగాణలోని ప్రైవేట్ మెడికల్‌, డెంటల్‌ కాలేజీల్లో 2026–27 విద్యా సంవత్సరానికి MBBS, BDS మేనేజ్‌మెంట్‌ కోటా (B, C/NRI కేటగిరీలు) ప్రవేశాల మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం (KNRUHS) అర్హులైన 7,113 మంది అభ్యర్థులతో తుది మెరిట్‌ జాబితాను విడుదల చేసింది. మేనేజ్‌మెంట్‌ కోటా ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌, ప్రాస్పెక్టస్‌ను ఇప్పటికే విశ్వవిద్యాలయం విడుదల చేసినట్లు కౌన్సెలింగ్‌ సమాచారం వెల్లడిస్తోంది. 

మెరిట్‌ జాబితాలో ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్‌ 9 సాయంత్రం 5:30 గంటల నుంచి సెప్టెంబర్‌ 11 సాయంత్రం 4 గంటల వరకు ఆన్‌లైన్‌లో వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ కౌన్సెలింగ్‌ ద్వారా రాష్ట్రంలోని ప్రైవేట్‌ మెడికల్‌, డెంటల్‌ కాలేజీలతో పాటు ఆర్మీ కాలేజ్‌ ఆఫ్‌ డెంటల్‌ సైన్సెస్‌, అనురాగ్‌ యూనివర్సిటీ పరిధిలోని నీలిమ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లోని సంబంధిత సీట్లను భర్తీ చేయనున్నారు.

వెబ్‌ ఆప్షన్ల నమోదులో సాంకేతిక సమస్యలు ఎదురైతే 9392685856, 7842136688 నంబర్లను సంప్రదించాలని యూనివర్సిటీ సూచించింది. నిబంధనలు, కౌన్సెలింగ్‌కు సంబంధించిన సందేహాల కోసం 7901098840, 9490585796 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపింది. అధికారిక కౌన్సెలింగ్‌ పోర్టల్‌లో కూడా టెక్నికల్‌, రెగ్యులేషన్‌ హెల్ప్‌లైన్‌ వివరాలు అందుబాటులో ఉన్నాయి. 

సీటు అలాట్‌మెంట్‌ పొందిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ పేమెంట్‌ గేట్‌వే ద్వారా యూనివర్సిటీ నిర్దేశించిన ఫీజును చెల్లించి అలాట్‌మెంట్‌ ఆర్డర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అనంతరం నిర్ణీత గడువులో సంబంధిత కళాశాలలో ప్రవేశ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.