ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు
చిట్యాల: నల్గొండ జిల్లా చిట్యాల మండల తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం (టిపిటిఎఫ్) అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలను టిపిటిఎఫ్ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి, కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా టిపిటిఎఫ్ సభ్యులు మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి సమయంలో ప్రైవేట్ ఉపాధ్యాయులు ఎదుర్కొన్న అనేక సమస్యల పరిష్కారం కోసం నర్రా బిక్షం రెడ్డి చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు. ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, వారి హక్కుల కోసం ఆయన నిరంతరం పోరాడుతున్నారని పేర్కొన్నారు.
ప్రైవేట్ ఉపాధ్యాయుల సంక్షేమం కోసం భవిష్యత్తులోనూ మరింత సేవ చేయాలని ఆకాంక్షిస్తూ, నర్రా బిక్షం రెడ్డి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని సభ్యులు కోరారు.
ఈ కార్యక్రమంలో టిపిటిఎఫ్ సభ్యులు బాలగోని లింగయ్య, ఉయ్యాల చంద్రశేఖర్, కూనూరు మధు, సుర్కంటి నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు