BREAKING
నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి
Date of Publish : 11 September 2026, 06:52 am
Posted by : DAVU RAVINDER REDDY

ఘట్కేసర్‌లో గణేశ్ విగ్రహ కేంద్రాల తనిఖీ

తెలంగాణ
/ మేడ్చల్-మల్కాజిగిరి
Reporter
Davu Ravinder Reddy Ghatkesar Mandal Reporter
11 Sep, 2026 - 06:52 AM
7 వీక్షణలు

విగ్రహాల తయారీ, రవాణాలో భద్రతా నిబంధనలు పాటించాలి: ఏసీపీ మోహన్‌కుమార్


ఘట్కేసర్ | Ntoday News

వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో మేడిపల్లి ఏసీపీ బి. మోహన్‌కుమార్, ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓతో కలిసి ఘట్కేసర్‌లోని గణేశ్ విగ్రహాల తయారీ, విక్రయ కేంద్రాలను పరిశీలించారు. విగ్రహాల తయారీ, విక్రయాలు, రవాణా సమయంలో భద్రతా ప్రమాణాలు పాటించేలా నిర్వాహకులకు సూచనలు చేశారు. 

విగ్రహాల తయారీదారులు, విక్రయదారులు, రవాణా నిర్వాహకులతో మాట్లాడిన ఏసీపీ.. విగ్రహాలను సురక్షితంగా నిర్వహించాలని సూచించారు. రవాణా సమయంలో విగ్రహాలను వాహనాల్లో పటిష్టంగా అమర్చడంతో పాటు, ప్రమాదాలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

అలాగే పోలీస్ శాఖ నిర్దేశించిన విగ్రహాల ఎత్తు పరిమితులను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. భారీ విగ్రహాల రవాణాలో విద్యుత్‌ తీగలు, రోడ్డు మార్గాలు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గణేశ్‌ ఉత్సవాల సందర్భంగా విగ్రహాల రవాణా, నిమజ్జన మార్గాల భద్రతపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. 

విగ్రహాల తయారీదారులు, విక్రయదారులు, నిర్వాహకులు పోలీసుల సూచనలు పాటించి ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు సహకరించాలని అధికారులు కోరారు.