మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
అనకాపల్లి జిల్లా, మునగపాక, సెప్టెంబర్ 11: వినాయక చవితి సందర్భంగా మునగపాక గ్రామంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ ఆర్థిక సహాయంతో మట్టి వినాయక విగ్రహాలను భక్తులకు అందజేశారు.
మునగపాకలోని ఎస్సీ కాలనీ, పల్లపు వీధిలోని నాయకుడి గుడి, బీసీ కాలనీ, సచివాలయం, ఇందిరమ్మ కాలనీ, గైరమ్మ కోవెల ప్రాంతాల్లో మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణకు అనుకూలమైన మట్టి విగ్రహాలను వినియోగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆడారి గణపతి అచ్చయ్య నాయుడు, జిల్లా అధికార ప్రతినిధి ఆడారి కాశిబాబు, గ్రామ మాజీ సర్పంచ్ దిమ్మల అప్పారావు, టెక్కలి రమణబాబు, మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు కోనపల్లి రామమోహనరావు, గ్రామ శాఖ అధ్యక్షుడు మల్ల రామ జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.
అలాగే రాజన్న బుజ్జిబాబు, ఆడారి రమణబాబు, పెంటకోట శివాజీ, ఆడారి లక్ష్మణరావు, సూరిశెట్టి దుర్గునాయుడు, భీశెట్టి ఈశ్వరరావు, పెంటకోట శ్రీనివాసరావు, ఆడారి గోపి, ఉల్లూరి సాయిరాం, వెల్గగా రామకృష్ణ, పెంటకోట జగన్నాధరావు, వేగి శ్రీను తదితర వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.