పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి
అన్నమయ్య జిల్లా న్యూస్: పుంగనూరు
పెన్షన్ లబ్ధిదారులకు దరఖాస్తు గడవు పొడిగించాలి :
రాష్ట్ర ప్రభుత్వం వివిధ వర్గాలకు పెన్షన్ కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించిందని ఇచ్చిన గడువును మరి కొంత పెంచాలని అందులో భాగంగా శుక్రవారం. పుంగనూరు పట్టణంలో గల మాల మహానాడు కార్యాలయంలో మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు అశోక్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు వృద్ధులు వితంతువులు. మధ్య కార్మికులు వివిధ రకాల పెన్షన్ల కోసం లబ్ధిదారులు ఎదురు చూశారని వారి కలలు సాకారం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తుల కోసం ఆదేశాలు ఇచ్చిందన్నారు ఇది మంచి శుభ పరిమాణానికి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు సెప్టెంబర్ 7వ తేదీ నుండి 16వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఇవ్వడంతో అనేకమంది వివిధ రకాల సర్టిఫికెట్స్ కోసం మీసేవ. సచివాలయం వద్ద ఉదయం నుండి సాయంత్రం వరకు ఎంతో ఆశతో మండు ఎండను లెక్కచేయకుండా పడిగాపులు కాచుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. అనేకచోట్ల సర్వర్ మోరాయించడంతో వందలాదిమంది దరఖాస్తు ప్రక్రియ జరగక నిరాశతో వెనక్కి తిరుగుతున్నారని. ఆవేదన వ్యక్తం చేశారు. అందులోనూ ఈ నెల లో వరుసుగా12,13,14, మూడు రోజులు పాటు సెలవులు రావడంతో అసలైన లబ్ధిదారులకు దరఖాస్తు చేసుకోవడానికి రెండు రోజులు మాత్రమే గడువు మిగిలి ఉంటుందని తెలిపారు. పెన్షన్ దరఖాస్తు ప్రక్రియలో ప్రభుత్వం అనేక రకాలుగా సర్టిఫికెట్స్ సమర్పించాలని ఆదేశాలు ఇవ్వడంతో కొత్తగా పెన్షన్ కొరకు నమోదు చేసుకునే లబ్ధిదారుల్లో ఆందోళన మొదలై కార్యాలయాలు చుట్టూ తిరిగి కార్యాలయాల్లో అలజడి రేపుతూ తాను అలిసిపోతూ ఉన్నారని పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒక్క విషయాలు దృష్టిలో పెట్టుకొని పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులకు ఈనెల ఆఖరి వరకు గడువు పెంచాలని కోరారు అలా చేయడం వలన నిజమైన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని అభిప్రాయ వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు శ్రీనివాసులు నాగరాజు పరమేష్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.