BREAKING
మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా
Date of Publish : 11 September 2026, 06:39 pm
Posted by : NTODAY NEWS

తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
11 Sep, 2026 - 06:39 PM
20 వీక్షణలు

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం తెలంగాణ జర్నలిస్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు జర్నలిస్టుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ తోగరి కరుణాకర్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.

జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారం కోసం, వారి ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం ముత్యాల రమేష్ మొదటినుంచీ చేస్తున్న కృషిని గుర్తించే ఈ కీలక బాధ్యతలను అప్పగించినట్లు తోగరి కరుణాకర్ తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా జేఏసీ ముందుకెళ్తోందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

జేఏసీ నాయకత్వానికి ధన్యవాదాలు:

రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన జేఏసీ రాష్ట్ర చైర్మన్ తోగరి కరుణాకర్‌కు ముత్యాల రమేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ— "రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలను ఎప్పటికప్పుడు జేఏసీ దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి శ్రమిస్తాను. జర్నలిస్టుల సంక్షేమమే నా మొదటి ప్రాధాన్యం" అని పేర్కొన్నారు.

జర్నలిస్టుల హర్షం:

ముత్యాల రమేష్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియామకం కావడం పట్ల పలువురు సీనియర్ జర్నలిస్టులు, వివిధ విలేకరుల సంఘాల నాయకులు మరియు స్థానిక ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ జేఏసీ బలోపేతానికి ఈ నియామకం ఎంతగానో తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.