గోగులపాడులో సూపర్ నేపియర్ ఘనపుల సాగుకు ప్రోత్సాహం
పల్నాడు: రొంపిచర్ల మండలం గోగులపాడు MPWS సెంటర్‌లో సంగం డెయిరీ ఆధ్వర్యంలో సూపర్ నేపియర్ ఘనపులు నాటుకున్న పాల ఉత్పత్తిదారులకు రూ.35,000 విలువైన చెక్కులను అందజేశారు.
సంగం డెయిరీ చైర్మన్ శ్రీ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పాల ఉత్పత్తిదారులకు ఆర్థికంగా తోడ్పాటు అందించడంతో పాటు పశువులకు నాణ్యమైన పచ్చిమేత అందుబాటులో ఉండేలా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు.
పాల ఉత్పత్తిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సూపర్ నేపియర్ సాగును విస్తృతంగా చేపట్టి, తమ పశువులకు అవసరమైన పచ్చిమేతను సమకూర్చుకోవాలని కోరారు. తద్వారా పశుపోషణ ఖర్చులు తగ్గడంతో పాటు పాల ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రొంపిచర్ల ప్లాంట్ మేనేజర్ N.V. కిరణ్ కుమార్ , సూపర్వైజర్ Ch. కృష్ణారెడ్డి , సంఘ అధ్యక్షులు K. సాంబశివరావు పాల ఉత్పత్తిదారులు పాల్గొన్నారు.