BREAKING
ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 11 September 2026, 10:09 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రజాస్వామ్య పరిరక్షణకు యువత ముందుకు రావాలి

ఆంధ్రప్రదేశ్
/ నెల్లూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Sep, 2026 - 10:09 PM
5 వీక్షణలు

నెల్లూరు, సెప్టెంబర్ 11: ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, దాన్ని పరిరక్షించేందుకు యువత ముందుకు రావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. సిపిఎం పూర్వ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ద్వితీయ వర్ధంతి సందర్భంగా గురువారం నెల్లూరులోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో సభ నిర్వహించారు. ‘సోషలిజమే ప్రత్యామ్నాయం’ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు.

సీతారాం ఏచూరి ఉన్నత కుటుంబంలో జన్మించినప్పటికీ, జీవితాంతం పీడిత, తాడిత ప్రజల కోసం పోరాడారని శ్రీనివాసరావు కొనియాడారు. ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో విద్యార్థి సమాఖ్య ఉద్యమాన్ని ముందుండి నడిపించి దేశ యువతకు దిక్సూచిగా నిలిచారని గుర్తుచేశారు. ఆయన చూపిన ఉద్యమ స్ఫూర్తి నేటికీ కొనసాగుతోందన్నారు. ఇటీవల జరిగిన యువత, విద్యార్థుల ఉద్యమాల్లోనూ వారు ముందుండి పోరాటాలు నడిపించారని తెలిపారు. ప్రజా సమస్యలపై వామపక్ష విద్యార్థి సంఘాలు పోషిస్తున్న పాత్రను దేశ ప్రజలు గుర్తిస్తున్నారని పేర్కొన్నారు.

ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో అనేక జాతీయ సంస్థలను ఏర్పాటు చేస్తే, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం వాటిని ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తోందని శ్రీనివాసరావు విమర్శించారు. ఈ విధానాల కారణంగా పేదలు మరింత పేదలుగా, ధనికులు మరింత ధనికులుగా మారుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పాలనలో కార్పొరేట్ సంస్థలకు భారీగా రుణ మాఫీలు జరిగాయని విమర్శించారు.

ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు విదేశాల్లోని భారతీయుల నల్లధనాన్ని దేశానికి తీసుకొస్తామని హామీ ఇచ్చారని శ్రీనివాసరావు గుర్తుచేశారు. అయితే ఆ హామీ అమలు కాలేదని విమర్శించారు. విదేశీ పెట్టుబడుల పేరుతో నల్లధనం తిరిగి దేశంలోకి వస్తోందని ఆరోపించారు. పరిశ్రమలకు ప్రభుత్వం భారీ రాయితీలు కల్పిస్తుండటంతో కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూరుతోందన్నారు.

మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలను పెంచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని శ్రీనివాసరావు ఆరోపించారు. దేశ యువత ప్రతి అంశాన్ని ప్రశ్నిస్తోందని, అయితే ప్రశ్నించే గొంతుకలను కేంద్ర ప్రభుత్వం సహించలేకపోతోందని విమర్శించారు. యువతలో కేంద్ర ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి పెరుగుతోందన్నారు.

దేశ రాజకీయాల్లో సీతారాం ఏచూరి లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని శ్రీనివాసరావు అన్నారు. ఆయన గొప్ప మార్క్సిస్టు మేధావి అని కొనియాడారు. అనేక అంశాలపై లోతైన అధ్యయనం చేసి, పార్లమెంటులోనూ, బయటా ప్రజా సమస్యలపై సూటిగా ప్రశ్నించేవారని గుర్తుచేశారు. దేశ శ్రేయస్సు, పీడిత ప్రజల హక్కుల కోసం సీతారాం ఏచూరి నెలకొల్పిన పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమానికి సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలం రమేష్ అధ్యక్షత వహించారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మన్నూరు భాస్కరయ్య, జెఎస్ ట్రస్ట్ చైర్మన్ చండ్ర రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.