BREAKING
ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 11 September 2026, 10:09 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నరసాపురం: అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో సైబర్ నేరాలపై అవగాహన బాల్య వివాహాలు, బాలికల భద్రతపై విద్యార్థులకు సూచనలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Sep, 2026 - 10:09 PM
11 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం నరసాపురం గ్రామంలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, బాల్య వివాహాలు, బాలికలపై జరుగుతున్న నేరాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విస్సన్నపేట ఎస్సై ఎం. అర్జున్ రాజ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా రూరల్ డీసీపీ లక్ష్మీనారాయణ, ఏసీపీ రామచంద్రరావు, సీఐ గురుప్రకాష్, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ శ్యామల, నరసాపురం తెలుగుదేశం పార్టీ నాయకుడు గోటేటి సుబ్రహ్మణ్యేశ్వరరావు, పోలీసు సిబ్బంది, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై ఎం. అర్జున్ రాజ్ మాట్లాడుతూ ప్రస్తుతం సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్నాయని తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలు, ఫోన్ కాల్స్, అనుమానాస్పద సమాచారంపై అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. బాలికలపై జరుగుతున్న నేరాలను ఎదుర్కొనే విధానం, అనుమానాస్పద పరిస్థితుల్లో వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు సమాచారం అందించాల్సిన అవసరాన్ని వివరించారు. డీసీపీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రస్తుతం ఎక్కడ చూసినా, పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న కేసుల్లో సైబర్ నేరాలు గణనీయంగా పెరుగుతున్నాయని అన్నారు. ప్రజల్లో, ముఖ్యంగా విద్యార్థుల్లో సైబర్ నేరాలపై అవగాహన పెంచడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏసీపీ రామచంద్రరావు మాట్లాడుతూ జనాభా పెరుగుదలతో పాటు సెల్‌ఫోన్ల వినియోగం కూడా భారీగా పెరిగిందని అన్నారు. దీనిని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు వివిధ రకాల మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. విద్యార్థులు సామాజిక మాధ్యమాలను జాగ్రత్తగా వినియోగించాలని, తెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీఐ గురుప్రకాష్ మాట్లాడుతూ వ్యక్తిగత సమాచారాన్ని గుర్తుతెలియని వ్యక్తులతో ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దని తెలిపారు. మోసానికి గురైన తర్వాత డబ్బును తిరిగి పొందడం చాలా కష్టమని, అందువల్ల మోసం జరగకముందే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సామాజిక మాధ్యమాల ద్వారా జరుగుతున్న మోసాలను ముందుగానే గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలు, బాలికల భద్రత, ఆడపిల్లలపై జరుగుతున్న నేరాల విషయంలో అప్రమత్తత అవసరాన్ని విద్యార్థులకు వివరించారు. అనుమానాస్పద ఘటనలు ఎదురైతే వెంటనే పెద్దలకు, పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాలని సీఐ గురుప్రకాష్ సూచించారు.