BREAKING
ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 11 September 2026, 10:09 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విస్సన్నపేట: నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి. కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Sep, 2026 - 10:09 PM
5 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేటలో నిత్యావసర వస్తువుల ధరలను ప్రభుత్వం వెంటనే అదుపు చేయాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ విస్సన్నపేట మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్థానిక గాంధీ బొమ్మ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విధానాలపై నాయకులు తీవ్ర విమర్శలు చేశారు.

ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ విస్సన్నపేట మండల కార్యదర్శి మర్సకట్ల త్యాగరాజు మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ వాటి పెరుగుదలను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. బియ్యం, వంట నూనెలు, పప్పు దినుసులు, సబ్బులు తదితర నిత్యావసర వస్తువుల ధరలు సామాన్య ప్రజలకు భారంగా మారాయని అన్నారు. ధరల పెరుగుదలతో కుటుంబాలపై ఆర్థిక భారం పెరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం ఆందోళనకరమన్నారు.

పెట్రోలు, డీజిల్ ధరలను కూడా వెంటనే అదుపులోకి తీసుకురావాలని త్యాగరాజు డిమాండ్ చేశారు. ఇంధన ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలపై కూడా ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. సామాన్య ప్రజలపై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.

వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు పండే పరిస్థితులు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని త్యాగరాజు తెలిపారు. విస్సన్నపేట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవసరమైన మార్గదర్శకాలు అందించడంతో పాటు సబ్సిడీపై విత్తనాలు అందించాలని కోరారు. రైతులకు అవసరమైన సహాయాన్ని అందించి వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని అన్నారు.

అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని విస్సన్నపేట తహసీల్దార్ కార్యాలయంలో అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో నందికొల రాజేష్, వేగి వెంకటేశ్వరరావు, పథకముడి నాగేశ్వరరావు, పితాని నాగేశ్వరరావు, దానయ్య, వడిత్య కేశవ, ఆకుల రాజు తదితరులు పాల్గొన్నారు.