BREAKING
వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం
Date of Publish : 26 July 2026, 06:40 pm
Posted by : NTODAY NEWS

బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
26 Jul, 2026 - 06:40 PM
63 వీక్షణలు

హైదరాబాద్ | NTODAY NEWS

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద రెడీ టూ సర్వ్ ఫౌండేషన్, అమ్మ హెల్పింగ్ హాండ్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన పేద రోగులు, వారి కుటుంబ సభ్యులు, అవసరమైన వారికి సుమారు 300 మందికి ఉచితంగా భోజనం పంపిణీ చేశారు.

సేవా కార్యక్రమంలో పలువురు స్వచ్ఛంద సేవకులు పాల్గొని స్వయంగా భోజనం పంపిణీ చేశారు. సమాజంలో ఆకలితో బాధపడుతున్న వారికి అండగా నిలవాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగించనున్నట్లు వెల్లడించారు.

ఆస్పత్రుల వద్ద చికిత్స కోసం నిరీక్షించే పేద రోగులు, వారి కుటుంబ సభ్యులకు ఈ అన్నదానం ఎంతో ఉపయోగకరంగా మారిందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను పలువురు అభినందించారు.

ఈ సందర్భంగా ఫౌండేషన్ నిర్వాహకులు పెద్ది శంకర్ మాట్లాడుతూ, సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలనుకునే దాతలు, స్వచ్ఛంద సేవకులు ముందుకు రావాలని కోరారు. సమాజ సేవలో మరింత మంది భాగస్వాములు కావడం ద్వారా అవసరమైన వారికి మరింత విస్తృతంగా సహాయం అందించగలమని ఆయన పేర్కొన్నారు.