BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 30 July 2026, 06:57 pm
Posted by : కూనురు మధు

చేనేత మహాసభ ప్రచార కరపత్రాల ఆవిష్కరణ

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
30 Jul, 2026 - 06:57 PM
73 వీక్షణలు

చేనేత మహాసభ ప్రచార కరపత్రాల ఆవిష్కరణ

చేనేత సొసైటీలకే నేరుగా ప్రభుత్వ దుస్తుల ఆర్డర్లు ఇవ్వాలని డిమాండ్


ఆగస్టు 4న హైదరాబాద్, ఆటోనగర్‌లోని కర్నాటి గార్డెన్స్‌లో తెలంగాణ చేనేత సహకార సంఘాల అధ్యక్షులు, పాలకవర్గ సభ్యుల రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ తెలిపారు. ఈ సదస్సును సంబంధించిన ప్రచార  కరపత్రాలను చిట్యాలలో గురువారం ఆయన ఆవిష్కరించారు. ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత సొసైటీల బలోపేతానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల మాదిరిగానే చేనేత సహకార సంఘాల క్యాష్ క్రెడిట్ రుణాలను ప్రభుత్వం పూర్తిగా మాఫీ చేయాలిఅని. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ ప్రకటన చేయాలని కోరారు. టెండర్లలో ప్రైవేట్ వ్యక్తులకు ప్రాధాన్యం ఇవ్వకుండా, గురుకులాలు, ప్రభుత్వ హాస్టళ్లకు కావలసిన దుస్తుల ఆర్డర్లను నేరుగా చేనేత సొసైటీలకే అప్పగించాలి అని అన్నారం ఏకగ్రీవంగా ఎన్నికైన సొసైటీలకు ప్రత్యేక గ్రాంటు ప్రకటించడంతో పాటు, నిలిచిపోయిన త్రిఫ్ట్ ఫండ్ డబ్బులను బ్యాంకుల ద్వారా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ​ఈ సదస్సుకు మాజీ ఐఏఎస్ అధికారి వెంకటేశం ముఖ్యఅతిథిగా హాజరై సహకార సంఘాల చట్టాలు, నిర్వహణపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కందగట్ల గణేష్, చిట్యాల చేనేత సొసైటీ అధ్యక్షుడు గంజి సుధాకర్, ప్రధాన కార్యదర్శి చెరుపల్లి శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు మిర్యాల వెంకటేశ్వర్లు, కోశాధికారి కోట రాంబాబు, డైరెక్టర్ వడ్డేపల్లి రాములు తదితరులు పాల్గొన్నారు...