BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 14 September 2026, 07:59 am
Posted by : DAVU RAVINDER REDDY

ఘట్కేసర్ - కీసర రహదారిపై ధర్నా

తెలంగాణ
/ మేడ్చల్-మల్కాజిగిరి
Reporter
Davu Ravinder Reddy Ghatkesar Mandal Reporter
14 Sep, 2026 - 07:59 AM
4 వీక్షణలు

వరుస ప్రమాదాలపై ప్రజాగ్రహం..

కాలేజీ విద్యార్థుల అతివేగంపై ఆగ్రహం.. చర్యలు తీసుకోవాలని డిమాండ్!

అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణమా?

ఘట్కేసర్  / Ntoday News : మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పరిధిలోని కొండాపూర్  వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఘట్కేసర్ కీసర ప్రధాన రహ దారిపై వరుస ప్రమాదాలు జరుగుతున్నా యని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పెట్రోల్ బంక్ ఎదురుగా స్థానిక ప్రజలు, పాదచారులు పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించి ఆందోళన కు దిగారు. ఈ రహదారిపై వేగంగా వచ్చే వాహనాల కారణంగా ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మృతి చెందారని స్థాని కులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా స్పందించక పోవడంతోనే రోడ్డుపైకి రావాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. హోలీ మేరీ కాలేజ్ విద్యా ర్థులు బైక్ లపై అతివేగంతో వెళ్లడమే ప్రమా దాలకు కారణమని, వారిపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. విజ్ఞాన ఇంజనీరింగ్ కాలేజీలో నుండి డ్రైనేజీ వ్యర్థాలు రోడ్డుపైకి వచ్చే దాని గురించి కాలేజే యాజమాన్యానికి ఎన్ని సార్లు కంప్లైంట్ చేసిన వారు స్పందించడం లేదని, అధికారులు విజ్ఞాన ఇంజనీరింగ్ కాలేజీ నుండి వస్తున్న డ్రైనేజీ వాటర్ ను రాకుండా తక్షణమే చర్యలు చేపట్టాలి. ప్రమాదాల నివారణకు వెంటనే స్పీడ్ బ్రేకర్లు, సీసీ కెమెరాలు, స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఘట్కేసర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ధర్నాను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, ధర్నా నిర్వహిస్తున్న వారికి మధ్య తీవ్ర తోపులాట జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం పోలీసులు స్థానికులతో చర్చలు జరిపి, సమ స్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో కొద్దిసే పటికి పరిస్థితి సద్దుమణిగింది. పోలీసుల నచ్చజెప్పడంతో స్థానికులు ఆందోళన విర మించినప్పటికీ... తక్షణమే భద్రతా చర్యలు చేపట్టకపోతే ఘట్కేసర్ ఎంఎంసి (MMC) ఆఫీస్ ముందు ధర్నాను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.