వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం
ప్రాజెక్టు పరిరక్షణ, నీటి నాణ్యత దృష్ట్యా నిర్ణయం.. ప్రజలు సహకరించాలని అధికారుల సూచన
గాలివీడు | Ntoday News
అన్నమయ్య జిల్లా గాలివీడు మండల ప్రజలకు వెలిగల్లు ప్రాజెక్టు అధికారులు కీలక సూచన చేశారు. వినాయక చవితి సందర్భంగా వెలిగల్లు ప్రాజెక్టు నీటిలో వినాయక విగ్రహాల నిమజ్జనం చేయడాన్ని నిషేధించినట్లు ప్రాజెక్టు అసిస్టెంట్ ఇంజనీర్ ఎం. సాంబశివుడు తెలిపారు.
ప్రాజెక్టు నీటిలో విగ్రహాలను నిమజ్జనం చేయకుండా ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ప్రాజెక్టు పరిరక్షణతో పాటు నీటి నాణ్యతను కాపాడే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం వినాయక నిమజ్జనాల కోసం వివిధ ప్రాంతాల్లో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు, ప్రత్యామ్నాయ నిమజ్జన ప్రాంతాల గుర్తింపుపై చర్యలు చేపడుతున్నారు.
వెలిగల్లు ప్రాజెక్టు నీటిని సాగునీటి అవసరాలకు వినియోగిస్తున్న నేపథ్యంలో నీటి వనరుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అసిస్టెంట్ ఇంజనీర్ సాంబశివుడు సూచించారు.