BREAKING
thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ thumb పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ thumb పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి
Date of Publish : 12 September 2026, 11:25 pm
Posted by : DAVU RAVINDER REDDY

ఉప్పల్ రింగ్‌రోడ్డుపై రాకపోకలు పునరుద్ధరణ

తెలంగాణ
/ మేడ్చల్-మల్కాజిగిరి
Reporter
Davu Ravinder Reddy Ghatkesar Mandal Reporter
12 Sep, 2026 - 11:25 PM
6 వీక్షణలు

పిల్లర్ల నిర్మాణ పనులు పూర్తికావడంతో ఇరువైపులా దారులు తెరుచుకున్నాయి

ఉప్పల్ | Ntoday News

ఉప్పల్ రింగ్‌రోడ్డులో ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్ల నిర్మాణానికి సంబంధించిన గుంతల పనులు పూర్తికావడంతో శుక్రవారం ఇరువైపులా రాకపోకలు పునరుద్ధరించారు. దీంతో వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి.

ఉప్పల్–నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో భాగంగా రింగ్‌రోడ్డు మధ్యలో నాలుగు పిల్లర్ల నిర్మాణం కోసం రహదారిపై రాకపోకలను నిలిపివేశారు. దీంతో రామంతపూర్, హబ్సిగూడ వైపు నుంచి ఉప్పల్, ఘట్కేసర్ మీదుగా వరంగల్ వైపు వెళ్లే వాహనాలను సర్వే ఆఫ్ ఇండియా ఎదురుగా ఉన్న సిగ్నల్ మీదుగా బీరప్పగడ్డ వైపు మళ్లించారు.

దాదాపు మూడు నెలలుగా ఉప్పల్–హన్మకొండ ప్రధాన రహదారిపై ఆంక్షలు, మళ్లింపులు కొనసాగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పిల్లర్ల నిర్మాణానికి సంబంధించిన కీలక పనులు పూర్తికావడంతో రాకపోకలను పునరుద్ధరించారు.

దీంతో ఉప్పల్ నుంచి వరంగల్, హన్మకొండ వైపు వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు కొంతమేర తగ్గనున్నాయి. రాకపోకలను పునరుద్ధరించడంతో స్థానికులు, వాహనదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, ఉప్పల్–నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ మొత్తం నిర్మాణాన్ని 2027 జూన్ నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.