BREAKING
కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష
Date of Publish : 12 September 2026, 08:15 am
Posted by : ADARI RAMA PRASAD

కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ

ఆంధ్రప్రదేశ్
/ అనకాపల్లి
12 Sep, 2026 - 08:15 AM
14 వీక్షణలు

తమ హక్కులు, డిమాండ్లను పరిష్కరించాలని జేఏసీ మెడికల్ అండ్ హెల్త్ ఉద్యోగుల డిమాండ్

అనకాపల్లి | Ntoday News

కాంట్రాక్టు ఉద్యోగులను తక్షణమే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ మెడికల్ అండ్ హెల్త్ ఆధ్వర్యంలో అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించేందుకు ఉద్యోగులు సిద్ధమయ్యారు. తమ హక్కులు, డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించి న్యాయం చేయాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

“మా హక్కులు.. మా డిమాండ్లు.. న్యాయం చేయాలి.. రెగ్యులర్ చేయాలి”, “మా సేవలు మాకు కావాలి.. న్యాయం చేయాలి.. రెగ్యులర్ చేయాలి” అంటూ ఉద్యోగులు నినాదాలు చేస్తూ తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు.

ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు

కాంట్రాక్టు ఉద్యోగులను తక్షణమే రెగ్యులర్ చేయాలి.

సమాన పనికి సమాన వేతనం కల్పించాలి.

ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలి.

పదోన్నతులు, సేవా భద్రత కల్పించాలి.

అనధికారిక తొలగింపులను నిలిపివేయాలి.

ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి.

దీర్ఘకాలంగా వైద్య, ఆరోగ్య శాఖలో సేవలందిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి పరిష్కరించాలని జేఏసీ నాయకులు కోరుతున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులంతా సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు.