పోషణ మాసంతో ఆరోగ్యకర సమాజానికి బాటలు
పోషణ మాసంతో ఆరోగ్యకర సమాజానికి బాటలు: మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి
ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి
ధర్మపురి:
తెలంగాణ ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, ధర్మపురి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని 5వ వార్డు అంగన్‌వాడీ కేంద్రంలో 'పోషణ అభియాన్ – పోషణ మాసం' కార్యక్రమాన్ని శనివారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి వేముల నాగలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
గర్భిణులు, బాలింతలకు సకాలంలో పౌష్టికాహారం అందించడం, చిన్నారులలో పోషకాహార లోపాన్ని అరికట్టడం, ముఖ్యంగా 3 సంవత్సరాలలోపు పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడమే అంగన్‌వాడీ కేంద్రాల ప్రధాన లక్ష్యమని చైర్‌పర్సన్ తెలిపారు. అంగన్‌వాడీల ద్వారా చిన్నారులకు పౌష్టికాహారం, ఆరోగ్య పరిరక్షణ, ప్రాథమిక విద్యను అందించడంతో పాటు, తల్లులలో అవగాహన పెంపొందిస్తున్నారని పేర్కొన్నారు. సమతులాహారంతోనే బలమైన, ఆరోగ్యకరమైన భవిష్యత్ తరాలను తీర్చిదిద్దవచ్చని ఆమె పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సెక్టార్ సూపర్ వైజర్ డాక్టర్ స్వప్న, అంగన్వాడీ టీచర్ మాధవిలత, ఉపాధ్యాయులు, గర్భిణులు, బాలింతలు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.