ఉపాధ్యాయుల సేవలు అమోఘం
ఉపాధ్యాయుల సేవలు అమోఘం: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఎంపీ లాడ్స్ నుంచి రూ.18 లక్షల ప్రొసీడింగ్స్, విశాఖ ట్రస్ట్ ఆధ్వర్యంలో 25 బెంచీల పంపిణీ
వెల్గటూర్ /పాశిగామా
ఉపాధ్యాయుల సేవలు చిరస్మరణీయమని, నవసమాజ నిర్మాణంలో గురువుల పాత్ర అమోఘమని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ కొనియాడారు. మండల పరిధిలోని MPPS పాసిగం పాఠశాలలో విశాఖ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు 25 బెంచీలను ఆయన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ... విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తూ నాణ్యమైన విద్యను అందిస్తున్న ఉపాధ్యాయుల సేవలు మరువలేనివని పేర్కొన్నారు. గతంలో ఈ పాఠశాలను సందర్శించినప్పుడు అదనపు తరగతి గది అవసరాన్ని గుర్తించి, ఎంపీ లాడ్స్ (MPLADS) నిధుల నుంచి రూ.18 లక్షలను మంజూరు చేస్తూ ప్రొసీడింగ్ కాపీని పాఠశాల వర్గాలకు అందజేశారు. సామాజిక దృక్పథంతో విశాఖ ట్రస్ట్ ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
అనంతరం ఎంపీ గడ్డం వంశీకృష్ణను, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దినేష్‌ను పాఠశాల ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించింది.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ దినేష్, కాడే సూర్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ తిరుపతి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శైలేందర్ రెడ్డి, సర్పంచ్‌లు శిరీష, లక్ష్మణ్, మల్లేశం, ఆలయ చైర్మన్ రమేష్, నాయకులు తిరుపతి, మురళి, సందీప్ రెడ్డి, కాండ్రపు మహేష్, జనార్ధన్, నరేష్, పాఠశాల హెచ్‌ఎం నీలం సంపత్, ఉపాధ్యాయులు, విశాఖ ట్రస్ట్ ప్రతినిధులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.