BREAKING
ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 11 September 2026, 09:15 pm
Posted by : SEETHA KIRAN KUMAR

తెలంగాణలో కృత్రిమ పనీర్‌పై ఏడాది నిషేధం

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
11 Sep, 2026 - 09:15 PM
11 వీక్షణలు

తయారీ నుంచి విక్రయం వరకు పూర్తిగా నిషేధం.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

హైదరాబాద్ | Ntoday News

తెలంగాణ ప్రభుత్వం కృత్రిమ పనీర్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. పాలతో సంబంధం లేకుండా రసాయనాలు, ఇతర పదార్థాలతో తయారు చేసే నాన్-డెయిరీ లేదా కృత్రిమ పనీర్ తయారీ, ప్రాసెసింగ్, ప్యాకింగ్, నిల్వ, పంపిణీ, విక్రయాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.

సెప్టెంబర్ 10 నుంచి ఈ నిషేధం ఏడాది పాటు అమల్లో ఉండేలా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

కృత్రిమ, నకిలీ పనీర్‌లో ఉపయోగించే పదార్థాల వల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సంస్థలు, ఆహార విక్రయ కేంద్రాల్లో ఇటువంటి ఉత్పత్తుల వినియోగం, విక్రయాలపై తనిఖీలు నిర్వహించనున్నారు.

నిషేధాన్ని ఉల్లంఘించి కృత్రిమ పనీర్‌ను తయారు చేసినా, నిల్వ చేసినా లేదా విక్రయించినా సంబంధిత వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఆహారం, ఔషధాల్లో కల్తీలను అరికట్టేందుకు కఠిన చర్యల దిశగా ముందుకు సాగుతోంది.