కామారెడ్డిలో బీసీ జేఏసీ ధర్మపోరాట దీక్ష
జనగణనలో ఓబీసీ కాలమ్ చేర్చాలి.. ప్రతి కులానికి ప్రత్యేక యూనిక్ కోడ్ కేటాయించాలని డిమాండ్
కామారెడ్డి | Ntoday News
కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్మపోరాట దీక్ష నిర్వహించారు. బీసీల జనాభా గణనకు సంబంధించిన అంశాలను జనగణనలో స్పష్టంగా నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్ష చేపట్టారు.
దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జనగణనలో ప్రత్యేకంగా ఓబీసీ కాలమ్‌ను చేర్చాలని బీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రతి కులానికి ప్రత్యేకమైన యూనిక్ కోడ్ కేటాయించి, కులాల వారీగా జనాభా వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని కోరారు.
కులాల వారీగా జనాభా గణాంకాలు అందుబాటులో ఉంటే సామాజిక, ఆర్థిక పరిస్థితుల ఆధారంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను మరింత సమర్థంగా అమలు చేయడానికి అవకాశం ఉంటుందని నాయకులు పేర్కొన్నారు. బీసీల హక్కుల సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.
కామారెడ్డిలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో గతంలోనూ బీసీ రిజర్వేషన్లు, జనాభా దామాషా ఆధారిత ప్రాతినిధ్యం వంటి అంశాలపై నిరసన కార్యక్రమాలు నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి.