అక్రమ లింగ నిర్ధారణకు నో ఛాన్స్..
- వైద్య కేంద్రాలపై నిఘా కట్టుదిట్టం డీఎంహెచ్డాక్టర్ ఆనంద్
- లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
మేడ్చల్ / Ntoday News: అక్రమ లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మేడ్చల్ వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆనంద్ హెచ్చరించారు. జిల్లా పీసీ అండ్ పీఎన్ డీటీ సలహా కమిటీ సమావేశం శుక్రవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి ఆనంద్ అధ్యక్షతన కలెక్ట్ రేట్లో జరిగింది. గర్భస్థ శిశు లింగ నిర్ధారణను అరికట్టడంతో పాటు పీసీ అండ్ పీఎన్ డీటీ చట్టాన్ని కఠినంగా అమలు చేయడంపై కమిటీ చర్చించింది. ఈ సందర్భం గా అల్ట్రాసోనోగ్రఫీ, జన్యు సలహా, జన్యు ప్రయోగశాలలు, ఇమేజింగ్కేంద్రాలకు సంబంధించిన 18 నూతన దరఖాస్తులు, 12 రెన్యువల్ దరఖాస్తులను పరిశీలించారు. చట్ట నిబంధనలకు అనుగుణంగా అనుమతులు, రెన్యువల్స్పై నిర్ణయాలు తీసుకున్నారు. ఆ సందర్భంగా డాక్టర్ ఆనంద్ మాట్లాడుతూ. లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, చట్టపరమైన చర్యలు తీసు కుంటామని స్పష్టంచేశారు.