BREAKING
thumb ● మార్కెట్ కమిటీ డైరెక్టర్ పర్సబోయిన నరసింహకు ఘన సన్మానం thumb ● మునగపాకలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగింపు thumb ● మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా నల్గొండలో బీజేపీ ఆందోళన thumb ● మునగపాకలో జోరుగా టీడీపీ అభ్యర్థుల ప్రచారం thumb ● ఘనంగా జాతీయ మాల మహానాడు 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు thumb ● మహిళా కండక్టర్‌పై దాడిని ఖండిస్తూ నర్సంపేట డిపో ఎదుట కార్మికుల ధర్నా thumb ● ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ టీవీల పంపిణీ thumb ● కల్వలలో ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమం thumb ● రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి thumb ● కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు thumb ● మార్కెట్ కమిటీ డైరెక్టర్ పర్సబోయిన నరసింహకు ఘన సన్మానం thumb ● మునగపాకలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగింపు thumb ● మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా నల్గొండలో బీజేపీ ఆందోళన thumb ● మునగపాకలో జోరుగా టీడీపీ అభ్యర్థుల ప్రచారం thumb ● ఘనంగా జాతీయ మాల మహానాడు 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు thumb ● మహిళా కండక్టర్‌పై దాడిని ఖండిస్తూ నర్సంపేట డిపో ఎదుట కార్మికుల ధర్నా thumb ● ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ టీవీల పంపిణీ thumb ● కల్వలలో ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమం thumb ● రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి thumb ● కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు
మంచి మాట
Date of Publish : 27 October 2026, 10:27 pm
Posted by : SEETHA KIRAN KUMAR

అక్రమంగా మద్యం విక్రయిస్తున్న స్థావరంపై టాస్క్‌ఫోర్స్‌ దాడి

తెలంగాణ
/ వరంగల్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
27 Oct, 2026 - 10:27 PM
12 వీక్షణలు
  • రూ.5,870 విలువైన మద్యం స్వాధీనం.. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసుల వెల్లడి
  • తదుపరి చర్యల కోసం మద్యం అప్పగింత

వరంగల్‌ | ఎన్‌ టుడే న్యూస్‌:

వరంగల్‌ నగరంలోని మిల్స్‌ కాలనీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అనుమతులు లేకుండా మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో రూ.5,870 విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

పోచమ్మగుడి బోడ్రాయికి చెందిన రావుల రమేశ్‌ అనుమతులు లేకుండా మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. పోలీసుల రాకను గమనించిన రమేశ్‌ పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

దాడిలో స్వాధీనం చేసుకున్న మద్యాన్ని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం మిల్స్‌ కాలనీ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు తదుపరి చర్యలు చేపడుతున్నారు.