BREAKING
thumb ● మార్కెట్ కమిటీ డైరెక్టర్ పర్సబోయిన నరసింహకు ఘన సన్మానం thumb ● మునగపాకలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగింపు thumb ● మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా నల్గొండలో బీజేపీ ఆందోళన thumb ● మునగపాకలో జోరుగా టీడీపీ అభ్యర్థుల ప్రచారం thumb ● ఘనంగా జాతీయ మాల మహానాడు 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు thumb ● మహిళా కండక్టర్‌పై దాడిని ఖండిస్తూ నర్సంపేట డిపో ఎదుట కార్మికుల ధర్నా thumb ● ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ టీవీల పంపిణీ thumb ● కల్వలలో ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమం thumb ● రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి thumb ● కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు thumb ● మార్కెట్ కమిటీ డైరెక్టర్ పర్సబోయిన నరసింహకు ఘన సన్మానం thumb ● మునగపాకలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగింపు thumb ● మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా నల్గొండలో బీజేపీ ఆందోళన thumb ● మునగపాకలో జోరుగా టీడీపీ అభ్యర్థుల ప్రచారం thumb ● ఘనంగా జాతీయ మాల మహానాడు 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు thumb ● మహిళా కండక్టర్‌పై దాడిని ఖండిస్తూ నర్సంపేట డిపో ఎదుట కార్మికుల ధర్నా thumb ● ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ టీవీల పంపిణీ thumb ● కల్వలలో ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమం thumb ● రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి thumb ● కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు
మంచి మాట
Date of Publish : 27 October 2026, 10:15 pm
Posted by : KOLA MAHESH

కల్వలలో ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమం

తెలంగాణ
/ మహబూబాబాద్ / మహబూబాబాద్
Reporter
Kola Mahesh Munugodu Constituency
27 Oct, 2026 - 10:15 PM
18 వీక్షణలు

ఎల్‌నినో ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి: వ్యవసాయ అధికారులు
కేసముద్రం | ఎన్‌ టుడే న్యూస్‌ | అక్టోబర్ 27:

రైతులు వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని వ్యవసాయ అధికారులు సూచించారు. తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని, సాగు ఖర్చులను తగ్గించుకుంటూ భూసారాన్ని కాపాడుకోవాలని కోరారు.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కల్వల గ్రామంలో మంగళవారం రైతులకు పంటల వైవిధ్యీకరణ, ఎల్‌నినో ప్రభావాలు, పంట అవశేషాల దహనం వల్ల కలిగే నష్టాలు, సమర్థవంతమైన వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు

‘ఖేత్ బచావో అభియాన్‌ (సాగుభూమి సంరక్షణ కార్యక్రమం)’నిర్వహించారు. కల్వల గ్రామ సర్పంచ్ వేల్పుల సుజాత రామచంద్రు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
తక్కువ నీటితో పండే పంటలపై దృష్టి పెట్టాలి
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు, వాటి ప్రభావం పంటలపై ఎలా ఉంటుందనే అంశాలను అధికారులు వివరించారు. యాసంగి 2026 సీజన్‌లో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అధిక నీటి అవసరం ఉన్న పంటలకు బదులుగా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తక్కువ నీటితో సాగు చేయగల పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, కూరగాయలు, ఇతర ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని తెలిపారు. పంటల మార్పిడి, వైవిధ్యీకరణ ద్వారా సాగు ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు నేల సారాన్ని కాపాడుకోవచ్చని వివరించారు.
పంట అవశేషాలను కాల్చకుండా సద్వినియోగం చేసుకోవాలి
పంట కోత అనంతరం మిగిలే అవశేషాలను కాల్చడం వల్ల నేలలోని ప్రయోజనకరమైన సూక్ష్మజీవులు నశించడంతో పాటు భూసారం తగ్గుతుందని అధికారులు తెలిపారు. దీనివల్ల వాయు కాలుష్యం కూడా పెరుగుతుందని వివరించారు.
పంట అవశేషాలను కాల్చకుండా సేంద్రియ ఎరువుల తయారీకి ఉపయోగించాలని, తద్వారా నేలలో సేంద్రియ పదార్థాన్ని పెంచుకోవచ్చని సూచించారు. నానో యూరియా వినియోగంపై అవగాహన పెంపొందించుకోవాలని, ఎరువులను శాస్త్రీయ పద్ధతుల్లో ఉపయోగించాలని, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలని కోరారు. నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచే పద్ధతులను అనుసరించాలని తెలిపారు.
సాగు ఖర్చులు తగ్గించుకుని లాభాలు పొందాలి
కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గంటా సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావాల వల్ల ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని యాసంగి 2026లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. సాగుభూమి సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ భవిష్యత్తులో వ్యవసాయానికి ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు.
మహబూబాబాద్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకుడు అజ్మీర శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఎల్‌నినో పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని అత్యల్ప నీటితో సాగు చేయగల పంటలను ఎంచుకోవాలని సూచించారు. అవసరానికి మించి ఎరువుల వినియోగాన్ని తగ్గించి భూసారాన్ని పెంపొందించాలని, సాగు ఖర్చులను నియంత్రిస్తూ లాభసాటిగా వ్యవసాయం చేయాలని తెలిపారు.
అనంతరం రైతులకు సబ్సిడీపై పెసర విత్తనాలను పంపిణీ చేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు
ఈ కార్యక్రమంలో తాళ్లపూసపల్లి గ్రామ సర్పంచ్ ఉప్పలయ్య, కల్వల గ్రామ ఉపసర్పంచ్ పెద్దగోని రవి, ఆత్మ సభ్యుడు కళ్లెం శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి బానోతు వెంకన్నతో పాటు ఉద్యాన, నీటిపారుదల, పశువైద్య, ఐకేపీ, వి.బి.జి. రాంజీ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కల్వల గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి, ఇతర ప్రజాప్రతినిధులు, సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులు, అభ్యుదయ రైతులు హాజరై తమ అనుభవాలను పంచుకున్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారుల సూచనల మేరకు సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని ఈ సందర్భంగా రైతులకు సూచించారు.