BREAKING
thumb ● మార్కెట్ కమిటీ డైరెక్టర్ పర్సబోయిన నరసింహకు ఘన సన్మానం thumb ● మునగపాకలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగింపు thumb ● మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా నల్గొండలో బీజేపీ ఆందోళన thumb ● మునగపాకలో జోరుగా టీడీపీ అభ్యర్థుల ప్రచారం thumb ● ఘనంగా జాతీయ మాల మహానాడు 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు thumb ● మహిళా కండక్టర్‌పై దాడిని ఖండిస్తూ నర్సంపేట డిపో ఎదుట కార్మికుల ధర్నా thumb ● ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ టీవీల పంపిణీ thumb ● కల్వలలో ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమం thumb ● రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి thumb ● కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు thumb ● మార్కెట్ కమిటీ డైరెక్టర్ పర్సబోయిన నరసింహకు ఘన సన్మానం thumb ● మునగపాకలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగింపు thumb ● మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా నల్గొండలో బీజేపీ ఆందోళన thumb ● మునగపాకలో జోరుగా టీడీపీ అభ్యర్థుల ప్రచారం thumb ● ఘనంగా జాతీయ మాల మహానాడు 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు thumb ● మహిళా కండక్టర్‌పై దాడిని ఖండిస్తూ నర్సంపేట డిపో ఎదుట కార్మికుల ధర్నా thumb ● ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ టీవీల పంపిణీ thumb ● కల్వలలో ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమం thumb ● రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి thumb ● కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు
మంచి మాట
Date of Publish : 27 October 2026, 10:11 pm
Posted by : KOLA MAHESH

కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / చౌటుప్పల్
Reporter
Kola Mahesh Munugodu Constituency
27 Oct, 2026 - 10:11 PM
17 వీక్షణలు

చట్టాన్ని తెలుసుకోండి.. బాల్యాన్ని కాపాడండి

రామన్నపేట | ఎన్‌ టుడే న్యూస్‌ | అక్టోబర్ 27:

బాలల హక్కులు, వ్యక్తిగత భద్రత, లైంగిక వేధింపుల నుంచి రక్షణపై ప్రతి విద్యార్థికి అవగాహన ఉండాలని రామన్నపేట అదనపు జూనియర్ సివిల్ జడ్జి, జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ వి. రత్నకుమారి సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ‘బచ్‌పన్ బచావో ఆందోళన్’లో భాగంగా రామన్నపేటలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో సోమవారం ‘కానూన్ జానో – బచ్‌పన్ బచావో’ అనే అంశంపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన న్యాయమూర్తి వి. రత్నకుమారి సుమారు 740 మంది విద్యార్థులకు చట్టపరమైన అంశాలపై అవగాహన కల్పించారు. బాలల రక్షణ కోసం రూపొందించిన పోక్సో చట్టం, బాలల హక్కులు, వ్యక్తిగత భద్రత, లైంగిక వేధింపుల నుంచి రక్షణ వంటి అంశాలను వివరించారు.

విద్యార్థులు మంచి స్పర్శ, చెడు స్పర్శ మధ్య తేడాను గుర్తించాలని న్యాయమూర్తి సూచించారు. ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినా, అసౌకర్యానికి గురిచేసినా భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు తెలియజేయాలని చెప్పారు. అవసరమైన సందర్భాల్లో న్యాయ సహాయం పొందేందుకు వెనుకాడకూడదని సూచించారు.

ప్రతి బాలుడు, బాలిక తమ హక్కులను తెలుసుకోవడంతో పాటు, వ్యక్తిగత భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. విద్యార్థులు భయం లేకుండా సురక్షిత వాతావరణంలో విద్యను అభ్యసించేలా సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు.

ఈ సదస్సులో ప్యానెల్ అడ్వకేట్లు కునూరు శ్రీనివాస్, మామిడి వెంకట్ రెడ్డి, అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ సభ్యుడు కె. శ్రీశైలం, పారా లీగల్ వాలంటీర్ కె. యాదయ్య, పాఠశాల ప్రిన్సిపాల్ సురేష్, కరస్పాండెంట్ జి. నరేందర్ రెడ్డి, ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్త కొండ జానకి, విద్యార్థులు పాల్గొన్నారు.