BREAKING
thumb ● మార్కెట్ కమిటీ డైరెక్టర్ పర్సబోయిన నరసింహకు ఘన సన్మానం thumb ● మునగపాకలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగింపు thumb ● మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా నల్గొండలో బీజేపీ ఆందోళన thumb ● మునగపాకలో జోరుగా టీడీపీ అభ్యర్థుల ప్రచారం thumb ● ఘనంగా జాతీయ మాల మహానాడు 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు thumb ● మహిళా కండక్టర్‌పై దాడిని ఖండిస్తూ నర్సంపేట డిపో ఎదుట కార్మికుల ధర్నా thumb ● ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ టీవీల పంపిణీ thumb ● కల్వలలో ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమం thumb ● రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి thumb ● కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు thumb ● మార్కెట్ కమిటీ డైరెక్టర్ పర్సబోయిన నరసింహకు ఘన సన్మానం thumb ● మునగపాకలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగింపు thumb ● మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా నల్గొండలో బీజేపీ ఆందోళన thumb ● మునగపాకలో జోరుగా టీడీపీ అభ్యర్థుల ప్రచారం thumb ● ఘనంగా జాతీయ మాల మహానాడు 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు thumb ● మహిళా కండక్టర్‌పై దాడిని ఖండిస్తూ నర్సంపేట డిపో ఎదుట కార్మికుల ధర్నా thumb ● ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ టీవీల పంపిణీ thumb ● కల్వలలో ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమం thumb ● రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి thumb ● కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు
మంచి మాట
Date of Publish : 27 October 2026, 10:19 pm
Posted by : KOLA MAHESH

ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ టీవీల పంపిణీ

తెలంగాణ
/ మహబూబాబాద్ / మహబూబాబాద్
Reporter
Kola Mahesh Munugodu Constituency
27 Oct, 2026 - 10:19 PM
12 వీక్షణలు

చేతన ఫౌండేషన్ సేవలు అభినందనీయం: సీఎం సలహాదారు వేము నరేందర్ రెడ్డి

కేసముద్రం | ఎన్‌ టుడే న్యూస్‌ :

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యను అందించేందుకు చేతన ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని సీఎం సలహాదారు, రాజ్యసభ సభ్యుడు వేము నరేందర్ రెడ్డి అన్నారు. డిజిటల్ టీవీల ద్వారా విద్యార్థులకు బోధన మరింత సులభంగా, ఆసక్తికరంగా మారుతుందని పేర్కొన్నారు.

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో మంగళవారం చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిజిటల్ టీవీల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ ఇన్ఫోసిస్టమ్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ప్రభుత్వ పాఠశాలలకు 10 డిజిటల్ టీవీలను వేము నరేందర్ రెడ్డి, పార్లమెంటు సభ్యుడు బలరాం నాయక్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వేము నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, డిజిటల్ టీవీలు విద్యార్థులకు బోధనలో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా పాఠ్యాంశాలను సులభంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆధునిక విద్యా సదుపాయాలు అందించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం సంతోషకరమన్నారు. చేతన ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాలు విద్యారంగ అభివృద్ధికి తోడ్పడతాయని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులోనూ ఫౌండేషన్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో చేతన ఫౌండేషన్ సభ్యులు వెనిగళ్ల వెంకటేశ్వరరావు, ముత్తినేని సురేష్, చంద్రకాని నవీన్, తాతా గణేష్, ఉప్పరపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కాట్రగడ్డ చంద్రశేఖర్, వివిధ ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు