BREAKING
thumb ● మార్కెట్ కమిటీ డైరెక్టర్ పర్సబోయిన నరసింహకు ఘన సన్మానం thumb ● మునగపాకలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగింపు thumb ● మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా నల్గొండలో బీజేపీ ఆందోళన thumb ● మునగపాకలో జోరుగా టీడీపీ అభ్యర్థుల ప్రచారం thumb ● ఘనంగా జాతీయ మాల మహానాడు 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు thumb ● మహిళా కండక్టర్‌పై దాడిని ఖండిస్తూ నర్సంపేట డిపో ఎదుట కార్మికుల ధర్నా thumb ● ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ టీవీల పంపిణీ thumb ● కల్వలలో ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమం thumb ● రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి thumb ● కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు thumb ● మార్కెట్ కమిటీ డైరెక్టర్ పర్సబోయిన నరసింహకు ఘన సన్మానం thumb ● మునగపాకలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగింపు thumb ● మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా నల్గొండలో బీజేపీ ఆందోళన thumb ● మునగపాకలో జోరుగా టీడీపీ అభ్యర్థుల ప్రచారం thumb ● ఘనంగా జాతీయ మాల మహానాడు 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు thumb ● మహిళా కండక్టర్‌పై దాడిని ఖండిస్తూ నర్సంపేట డిపో ఎదుట కార్మికుల ధర్నా thumb ● ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ టీవీల పంపిణీ thumb ● కల్వలలో ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమం thumb ● రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి thumb ● కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు
మంచి మాట
Date of Publish : 27 October 2026, 10:20 pm
Posted by : KOLA MAHESH

మహిళా కండక్టర్‌పై దాడిని ఖండిస్తూ నర్సంపేట డిపో ఎదుట కార్మికుల ధర్నా

తెలంగాణ
/ వరంగల్ / వరంగల్
Reporter
Kola Mahesh Munugodu Constituency
27 Oct, 2026 - 10:20 PM
18 వీక్షణలు

ప్రవళికకు మెరుగైన వైద్యం అందించాలి.. పూర్తిస్థాయి జీతంతో ఐఓడీ మంజూరు చేయాలి

నర్సంపేట | ఎన్‌ టుడే న్యూస్‌ | అక్టోబర్ 27:

మణుగూరు డిపోకు చెందిన మహిళా కండక్టర్ ప్రవళికపై జరిగిన దాడిని నిరసిస్తూ నర్సంపేట ఆర్టీసీ డిపో కార్మికులు సోమవారం డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన కార్మికులు, మహిళా ఉద్యోగుల భద్రతకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న ప్రవళికకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని, ఆమె పూర్తిగా కోలుకునే వరకు పూర్తిస్థాయి జీతంతో కూడిన ఐఓడీ (ఇన్‌జ్యూరీ ఆన్ డ్యూటీ) సౌకర్యం కల్పించాలని కోరారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడులు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

ప్రవళికపై దాడికి పాల్పడిన ప్రయాణికురాలిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు. బాధితురాలికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం తరఫున రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి సహాయం అందించాలని కోరారు.

ఆర్టీసీ ఉద్యోగులు ప్రజలకు సేవలందించే క్రమంలో ఇలాంటి దాడులకు గురికావడం ఆందోళనకరమని పేర్కొన్నారు. మహిళా ఉద్యోగులు భయం లేకుండా విధులు నిర్వహించేలా భద్రతా చర్యలు బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ నిరసన కార్యక్రమంలో నర్సంపేట డిపో ఉద్యోగులు నర్సింహులు, సుజాత, రవీందర్ రెడ్డి, చైతన్య, సూపర్‌వైజర్ గోవర్ధన్‌తో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు. ప్రవళికకు న్యాయం చేయాలని, బాధితురాలికి మెరుగైన వైద్యం, తగిన ఆర్థిక సహాయం అందించాలని వారు డిమాండ్ చేశారు.