BREAKING
thumb ● మార్కెట్ కమిటీ డైరెక్టర్ పర్సబోయిన నరసింహకు ఘన సన్మానం thumb ● మునగపాకలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగింపు thumb ● మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా నల్గొండలో బీజేపీ ఆందోళన thumb ● మునగపాకలో జోరుగా టీడీపీ అభ్యర్థుల ప్రచారం thumb ● ఘనంగా జాతీయ మాల మహానాడు 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు thumb ● మహిళా కండక్టర్‌పై దాడిని ఖండిస్తూ నర్సంపేట డిపో ఎదుట కార్మికుల ధర్నా thumb ● ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ టీవీల పంపిణీ thumb ● కల్వలలో ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమం thumb ● రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి thumb ● కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు thumb ● మార్కెట్ కమిటీ డైరెక్టర్ పర్సబోయిన నరసింహకు ఘన సన్మానం thumb ● మునగపాకలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగింపు thumb ● మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా నల్గొండలో బీజేపీ ఆందోళన thumb ● మునగపాకలో జోరుగా టీడీపీ అభ్యర్థుల ప్రచారం thumb ● ఘనంగా జాతీయ మాల మహానాడు 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు thumb ● మహిళా కండక్టర్‌పై దాడిని ఖండిస్తూ నర్సంపేట డిపో ఎదుట కార్మికుల ధర్నా thumb ● ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ టీవీల పంపిణీ thumb ● కల్వలలో ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమం thumb ● రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి thumb ● కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు
మంచి మాట
Date of Publish : 27 October 2026, 10:22 pm
Posted by : KOLA MAHESH

ఘనంగా జాతీయ మాల మహానాడు 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తెలంగాణ
/ మహబూబాబాద్ / మహబూబాబాద్
Reporter
Kola Mahesh Munugodu Constituency
27 Oct, 2026 - 10:22 PM
14 వీక్షణలు

జెండాను ఆవిష్కరించిన మండల అధ్యక్షుడు కారం ప్రశాంత్‌.. మాలలకు న్యాయం 

నెల్లికుదురు | ఎన్‌ టుడే న్యూస్‌:

జాతీయ మాల మహానాడు 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నెల్లికుదురు మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ కూడలిలో సోమవారం ఘనంగా నిర్వహించారు. జాతీయ మాల మహానాడు మండల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కారం ప్రశాంత్‌ అంబేద్కర్ విగ్రహానికి మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాల మహానాడు జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కారం ప్రశాంత్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మాలలకు జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్‌ చేశారు. వర్గీకరణ విషయంలో ప్రభుత్వం మాలలకు అన్యాయం చేసిందని విమర్శించారు. రోస్టర్‌ పాయింట్ల కేటాయింపులో మాలలకు సముచిత స్థానం కల్పించాలని కోరారు. మాలలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు.

సామాజిక న్యాయం, సమాన అవకాశాల కల్పనలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా నాయకులు కోరారు.

ఈ కార్యక్రమంలో అద్దంకి యువసేన మండల అధ్యక్షుడు బాణాల సంజీవ, రవిరాల గ్రామ అధ్యక్షుడు అరె ఐలయ్య, మండల నాయకులు బచ్చు సత్తయ్య, పత్తి వెంకటయ్య, కమటం వెంకన్న, మయ్య వీరన్న, బింగి గిరి, అశోధ శశిధర్‌, గార అమీన్‌తో పాటు వివిధ గ్రామాలకు చెందిన మాల మహానాడు నాయకులు పాల్గొన్నారు.